Minister Venugopala Krishna : అందుకే చంద్రబాబు, పవన్ భయపడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు కులగణనను తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), టీడీపీ చీఫ్ చంద్రబాబు(Chandrababu) కులగణనను తప్పుబట్టారు. వారి తీరుపై మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా.? వ్యతిరేకమా.? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారన్నారు.
బీహార్(Bihar)లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఏపీలో కులగణన(Census) జరుగుతుందన్నారు. చంద్రబాబు, పవన్ కుల గణనతో భయపడుతున్నారు. అందుకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదని.. ఏపీ(AP)లో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం(Ambedhkar Statue) ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67 శాతం కుల గణన పూర్తైందని తెలిపారు.