Minister Satyaprasad : జగన్ వినుకొండ వెళ్లింది రాజకీయ లబ్ధి కోసమే
జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జగన్ గవర్నర్ ని కలిసినా, ప్రధానిని కలిసినా, ఢిల్లీలో ధర్నా చేసిన ప్రజలు నమ్మరన్నారు. పరామర్శకు వినుకొండ వెళ్లడం రాజకీయ లబ్ధి కోసమేనన్నారు. వినుకొండలో హత్యకు సంబంధించి ఇద్దరు మధ్య వ్యక్తిగత కక్షలు కారణం.. ఎక్కడ కూడా రాజకీయ అంశాలు లేవు అన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని నిర్మాణాన్ని తిరిగి పునః ప్రారంభించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో జగన్, ఆయన అనుచరులు బాగుపడటం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు.
గతంలో జగన్ అరాచక పాలన చూసామని.. టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చంద్రయ్యను దారుణంగా చంపారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాలు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని.. ప్రస్తుతం రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును అసెంబ్లీలో ఎంత హేళనగా మాట్లాడారో అందరూ చూశారన్నారు.
జగన్ నాయకులను అదుపులో పెట్టి ఉంటే ఇలాంటి ఫలితాలు వచ్చేవి కాదు కదా అని అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు అన్నీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకొని రావడానికి జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో జగన్ పర్యటనలన్నీ ఆయన కేసులకు సంబంధించి అంశాలపైనే ఢిల్లీ పర్యటనలు సాగాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు దోచుకునేందుకు ప్రయత్నించిందన్నారు. గుజరాత్ తరహా భూ హక్కు చట్టం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక భూకబ్జాలు, దందాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలు , భూ ఆక్రమణలు మీద సమగ్ర విచారణ జరుపుతామన్నారు.