కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత

కుప్పంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పనైపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది... కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుందన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారన్నారు. ఫిబ్రవరి 26న సీఎం జగన్ వస్తున్నారని.. కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారని రోజా తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం అర్థమైంది కాబట్టే, నారా భువనేశ్వరి తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను పోటీ చేస్తానని చెబుతున్నారన్నారు. కుప్పం ప్రజలకే ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ చేయలేడని ప్రజలు తెలుసుకున్నారని.. అందుకే 2024 ఎన్నికల్లో కుప్పం సహా 175కి 175 స్థానాల్లో వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి రోజా తెలిపారు.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పద­ని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని అన్నారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు.

Updated On 21 Feb 2024 11:10 PM GMT
Yagnik

Yagnik

Next Story