బాలకృష్ణ టీడీపీ ఆఫీసుకెళ్లి చంద్రబాబు కుర్చీలో కూర్చొని మాట్లాడటంపై ప్రజల్లో ఒక చర్చ జరిగిందని మంత్రి రోజా అన్నారు. ఇన్నిరోజులూ ఆ కుర్చీలో ఒక వెన్నుపోటుదారుడు కూర్చొంటే.. ఇప్పుడు ఒక మెంటల్‌గాడు కూర్చొన్నాడు అని అనుకుంటున్నారని అన్నారు.

బాలకృష్ణ(Balakrishna) టీడీపీ(TDP) ఆఫీసుకెళ్లి చంద్రబాబు కుర్చీలో కూర్చొని మాట్లాడటంపై ప్రజల్లో ఒక చర్చ జరిగిందని మంత్రి రోజా అన్నారు. ఇన్నిరోజులూ ఆ కుర్చీలో ఒక వెన్నుపోటుదారుడు కూర్చొంటే.. ఇప్పుడు ఒక మెంటల్‌గాడు కూర్చొన్నాడు అని అనుకుంటున్నారని అన్నారు. అది నేను చెప్పే మాట కాదని.. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు తాను మానసిక వికలాంగుడిని అని చెప్పుకున్నారని.. దేశంలోని ప్రముఖ నాలుగు మెంటల్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నానని.. సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ సైకో(Self Certified Psycho)గా అఫిడవిట్‌(Affidavit)లో స్పష్టంగా పేర్కొన్నాడని మంత్రి రోజా(MInister Roja) తెలిపారు.

అలాంటి మానసిక రోగి తెలుగుదేశం కోసం నేను పోరాడుతాను అని అంటుంటే.. ఆ పార్టీ కేడర్‌లో భయం మొదలైందని అన్నారు. తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందని మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి చేసిన దొంగ సాక్ష్యాధారాలతో సహా దొరికి జైలుపాలయిన నీ బావ చంద్రబాబు(Chandrababu) కోసం పోరాడితే.. అది తెలుగువాడి కోసమో.. తెలుగువాడి పౌరుషం కోసమో పోరాడినట్లు కాదని బాలకృష్ణకు చెబుతున్నానని వ్యాఖ్య‌లు చేశారు.

నీ తండ్రి ఎన్టీరామారావు తెలుగువాడి పౌరుషమేంటో ఢిల్లీ(Delhi)కి చూపించేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి, తెలుగువాడికి అండగా ఉంటే.. ఆయన దగ్గర్నుంచి పార్టీని లాక్కుని వైశ్రాయ్‌హోటల్‌(Vaishroi Hotel) దగ్గర చెప్పులేయించి, కన్నీరు పెట్టించిన చంద్రబాబుపై.. ఆరోజు నువ్వు పోరాడి ఉన్నట్లయితే తెలుగు ప్రజలంతా సంతోషించి ఉండేవారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌(Hyderabad)లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి చంద్రబాబుతో పాటు దొంగలా కరకట్టకు పారిపోకుండా ఆరోజు నిలబడి ఉంటే తెలుగువాడి పౌరుషం, సత్తా ఏంటో అందరూ చూసేవాళ్లు. అభినందించేవాళ్లని అన్నారు.

ప్రత్యేకహోదా కాదు. తనకు ప్యాకేజీ ఇస్తే చాలని నీ బావ చంద్రబాబు, నీ అల్లుడు లోకేశ్‌(Lokesh) కలిసి ఏవిధంగా ప్రజల సొమ్ము తిన్నారో.. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో.. అందరూ చూశారు. అప్పుడు నువ్వు పోరాడి ఉంటే తెలుగువాడి కోసం పోరాడిన వాడివి అయ్యేవాడివి. బాలకృష్ణ.. ఈరోజు నువ్వు ఒక దొంగను కాపాడేందుకు పోరాటం చేస్తున్నావని ప్ర‌శ్నించారు.

Updated On 12 Sep 2023 8:14 PM GMT
Yagnik

Yagnik

Next Story