Minister Roja satires on Balakrishna : బావ కళ్లల్లో ఆనందం చూడటానికి తెగ ఆరాట పడుతున్నారు
టీడీపీ(TDP) శాసనసభ్యులు ఈరోజు శాసనసభలో రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా(Minister Roja) మండిపడ్డారు. స్పీకర్‌కి, ఆయన ఛైర్‌కు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నీచంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. పోడియం పైకి ఎక్కి, ఆయన చుట్టూ చేరి పేపర్లు చింపి మొఖాన విసిరారు. స్పీకర్ ఎదుటనున్న మానిటర్‌ను లాగేస్తూ వారి మంచినీళ్ల గ్లాసును ఎత్తి పడేసి పగులకొట్టారు. సభా సాంప్రదాయాన్ని పాటించకుండా అత్యంత జుగుప్సాకరంగా రచ్చ చేశారని మండిపడ్డారు.
టీడీపీ(TDP) శాసనసభ్యులు ఈరోజు శాసనసభలో రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా(Minister Roja) మండిపడ్డారు. స్పీకర్‌కి, ఆయన ఛైర్‌కు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నీచంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. పోడియం పైకి ఎక్కి, ఆయన చుట్టూ చేరి పేపర్లు చింపి మొఖాన విసిరారు. స్పీకర్ ఎదుటనున్న మానిటర్‌ను లాగేస్తూ వారి మంచినీళ్ల గ్లాసును ఎత్తి పడేసి పగులకొట్టారు. సభా సాంప్రదాయాన్ని పాటించకుండా అత్యంత జుగుప్సాకరంగా రచ్చ చేశారని మండిపడ్డారు.
బాలకృష్ణ దృష్టిలో(Balakrishna) అసెంబ్లీ అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నాడేమో.. ఆయన నిండు సభలో మీసం మెలేసి తొడగొడట్టమేంటి..? అసలు ఆయనకు సిగ్గుందా..? లేదా..? అని అడుగుతున్నారు. నువ్వు మీసం మెలేసి తొడ కొడితే ఇక్కడ భయపడేవాళ్లెవరూ లేరని అన్నారు. నాతోపాటు తొమ్మిదేళ్లుగా బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం గురించి గానీ అక్కడ ప్రజల గురించికానీ, ఏరోజూ పట్టించుకోని బాలకృష్ణ.. ఈరోజు శాసనసభకొచ్చి బావ కళ్లల్లో ఆనందం చూడటానికి తెగ ఆరాట పడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ మీసాలు తిపాదమేదో .. వాళ్ల నాన్న మీద వైశ్రాయ్ హోటల్ దగ్గర చంద్రబాబు చెప్పులేయించినప్పుడు చేసుంటే బాగుండేది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. కానీ, స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో దొంగగా ఆధారాలతో సహా దొరికి చంద్రబాబు జైలుకెళ్తే.. ప్రజలకు కోర్టులు, చట్టాల పట్ల నమ్మకం కలిగిన తరుణంలో బాలకృష్ణ ఈ స్థాయికి దిగజారడం నీచాతీనీచంగా చూడాలన్నారు.
నిజంగా చంద్రబాబు(Chandrababu) స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో(Skill Development Scam) ఏ తప్పూ చేయకపోతే.. సీఐడీ పోలీసులు నంద్యాల నుంచి మంగళగిరికి తెస్తున్నప్పుడు ఇప్పుడు మాట్లాడే టీడీపీ నేతలంతా అప్పుడు ఎక్కడికెళ్లారు..? ఆ రోజెందుకు రోడ్లమీదకొచ్చి గొడవలు చేయలేదు..? అని ప్రశ్నించారు. ఏసీబీ కోర్టులో దాదాపు 10 గంటలసేపు చంద్రబాబును ఉంచితే .. స్వయంగా న్యాయమూర్తి ఆయనకు మాట్లాడే అవకాశమిస్తే ఎందుకు తానేమీ తప్పు చేయలేదని చెప్పుకోలేదు..? స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ అసలు జరగలేదని.. ఈ స్కామ్‌లో తన ప్రమేమమేదీ లేదని.. తానేమీ డబ్బులు తినలేదని ఎందుకు మాట్లాడలేదు..? అని నిలదీశారు.
చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన పేరుమోసిన లాయర్లు కూడా ఈ స్కామ్‌లో చంద్రబాబు తప్పేమీలేదని చెప్పలేదన్నారు. ఆయన్ను అరెస్టు చేసేటప్పుడు గవర్నర్ కి చెప్పలేదని.. 24 గంటల్లోపల కోర్టు ఎదుటకు తేలేదని కుంటిసాకులు చెప్పారే తప్ప.. స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయాన్ని గురించి వారు మాట్లాడలేదు. ఎందుకంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.371 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిన సంగతి నిజం అని దుయ్యబట్టారు.
టీడీపీ నేతలు ఎంతగా హంగామా సృష్టించి శాసనసభ నుంచి తప్పించుకున్నా.. రేపైనా చంద్రబాబు అరెస్టుపై చర్చ జరుగుతుందన్నారు. అప్పుడు మేమే కావాలని బాలకృష్ణకు మాట్లాడే అవకాశం ఇవ్వమని స్పీకర్ ని కోరతామన్నారు. ఆయనప్పుడు ఏమని మాట్లాడుతాడో చూద్దాం.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందని చెబుతాడో.. అందులో తన బావ చంద్రబాబు దొంగ అని అంటాడో లేదో.. రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంలో రూ.241 కోట్లు షెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు ఎలా చేరాయో చెబుతాడేమో చూద్దామని అన్నారు.
కేవలం జనాల్లో పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతలు ఈరోజు అసెంబ్లీకొచ్చి ఓవరాక్షన్ చేస్తున్నారని అర్ధమౌతుంది. అయితే, ప్రజలు మీరనుకుంత అమాయకులు కాదు. చంద్రబాబు అరెస్టు పట్ల ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారని టీడీపీ సభ్యులు తెలుసుకోవాలని అన్నారు.