పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్‌ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్‌ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీ-జ‌న‌సేన సీట్ల ప్ర‌క‌ట‌న‌పై ఆమె స్పందిస్తూ.. ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? అని ప‌వ‌న్ ను ప్ర‌శ్నించారు. 24 సీట్లకే తోక ఊపుకుంటు చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్నావ్ అని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థంకావటంలేదన్నారు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచావో జనసైనికులకు చెప్పాలన్నారు. 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు.. జగనన్నను ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని అన్నారు. వాళ్లలో వాళ్లకే గందరగోళం.. ఈ పరిస్ధితిలో 118 స్థానాలు ప్రకటించారని కామెంట్ చేశారు. ఇందులో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ స్థానాలు కూడా ప్రకటించారు, కానీ పవన్ ఎక్కడనుంచి పోటీ చేస్తారో చెప్పలేదన్నారు. ఎందుకంటే 1 స్థానంలో ఒడిపోయిన వారికి మొదటి జాబితాలో, 2 స్థానాల్లో ఒడిపోయినవారికి రెండవ జాబితాలో పేరు ఇస్తారేమో పవన్ తెలుసుకోవాలన్నారు.

Updated On 24 Feb 2024 8:34 AM GMT
Yagnik

Yagnik

Next Story