నారా లోకేశ్‌(Nara Lokesh) నిన్న ఢిల్లీలో(Delhi) రాష్ట్రపతిని కలిశారు. దాన్ని చూసినోళ్లంతా.. ‘అదేంటీ.. చిన్నదొంగ వెళ్లి పెద్దదొంగను జైలు నుంచి విడిపించాలని రాష్ట్రపతికి చెబుతున్నాడు’ అంటూ అనుకున్నారని మంత్రి రోజా అన్నారు. ఏరోజైనా వీళ్లు రాష్ట్రం కోసం గానీ.. ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం గానీ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా..? అని అందరూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. నారా లోకేశ్‌ మాటలు గానీ.. వాళ్ల అమ్మతో పాటు టీడీపీ(TDP) నేతల ప్రవర్తన ఎలా ఉందంటే..

నారా లోకేశ్‌(Nara Lokesh) నిన్న ఢిల్లీలో(Delhi) రాష్ట్రపతిని కలిశారు. దాన్ని చూసినోళ్లంతా.. ‘అదేంటీ.. చిన్నదొంగ వెళ్లి పెద్దదొంగను జైలు నుంచి విడిపించాలని రాష్ట్రపతికి చెబుతున్నాడు’ అంటూ అనుకున్నారని మంత్రి రోజా అన్నారు. ఏరోజైనా వీళ్లు రాష్ట్రం కోసం గానీ.. ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం గానీ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా..? అని అందరూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. నారా లోకేశ్‌ మాటలు గానీ.. వాళ్ల అమ్మతో పాటు టీడీపీ(TDP) నేతల ప్రవర్తన ఎలా ఉందంటే.. మేమంతా చట్టాలకు అతీతులం అన్నట్టుగా ఉంది. చంద్రబాబు ఈ రాష్ట్ర సంపదను అడ్డంగా దోచేస్తే.. వాళ్లమీద ఏ కేసులూ పెట్టకూడదంట. అరెస్టులు చేయకూడదంట. ఒకపక్కన రాష్ట్ర ఖజనాకు కన్నమేసి వందల కోట్లు కొట్టేసిన దొంగగా ఆధారాలతో సహా దొరికి జైలుకెళ్లిన చంద్రబాబు గురించి న్యాయస్థానాల్లో తీర్పులు వస్తున్నాయి. బయట వీళ్లు మాత్రం మేమంతా సచ్ఛీలురుమంటూ బిల్డప్‌లిస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిప‌డ్డారు.

ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ(PM Narendra Modi), అమిత్‌షా(Amith Shah) కాళ్లు పట్టుకోవడానికి నారా లోకేశ్‌ పడరాని పాట్లు పడుతున్నాడని అన్నారు. వాళ్లేమో ఇతని తీరుకు ముందుగానే భయపడి తమ కాళ్లను దాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రజలు నమ్మకంగా చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెడితే.. వారి నమ్మకాన్ని వమ్ము చేసి, ప్రజా సొమ్మును అడ్డంగా దోచేసిన దొంగగా మిగిలాడు. అలాంటి దోపిడీ దొంగకు మద్ధతిచ్చే ఉద్దేశం లేకనే మోదీ, అమిత్‌ షా లోకేశ్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదనేది స్పష్టమౌతున్న సంగతని అన్నారు.

చంద్రబాబు(Chandrababu) హయాంలో జరిగిన దొంగతనాలు, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన చేసిన కుంభకోణాలు ఒకటీ అరా కాదు. తీగలాగేకొద్దీ ఆయ‌న అవినీతి డొంక కదులుతూనే ఉంది. ఇప్పటికి నాలుగు కుంభకోణాల్లో ఆయన నేరస్తుడు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్‌భూముల స్కామ్, అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌.. వీటన్నింటికీ చంద్రబాబు ఏ విధంగా సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించి రూ.కోట్లు కొట్టేశాడనేది ఆధారాలతో సహా ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో తేలింద‌ని పేర్కొన్నారు.

స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ నేరస్తుడు జైల్లో ఉంటే.. ఇన్నర్‌రింగ్‌రోడ్‌ స్కామ్‌లో నిందితుడైన లోకేశ్‌ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవడమనేది హాస్యాస్పదం అన్నారు. మరి, లోకేశ్‌ ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ స్కామ్‌పై చాలా అమాయకంగా నటిస్తూ మాట్లాడుతున్నాడు. అసలు, ఇన్నర్‌రింగ్‌ రోడ్డే లేదు కదా.. స్కామ్‌ ఎలా జరుగుతుందని ఆయన దీర్ఘాలు తీస్తున్నాడు. కానీ, ఆయన తండ్రి మాయాజాలం అతనికి అర్ధమైందో లేదో గానీ.. ప్రజలకు మాత్రం ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ స్కామ్‌ పట్ల స్పష్టత వచ్చిందని అన్నారు.

అమరావతి రాజధానికి ఇన్నర్‌ రింగ్ రోడ్‌ లేకుండానే.. చంద్రబాబు పెద్ద ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించినట్లు గ్రాఫిక్స్‌ల్లో కళ్లకు కట్టినట్టు చూపించి లింగమనేని తదితరులు దగ్గర రూ.కోట్లు విలువైన భూమిని కొట్టేసి క్విడ్‌ప్రోకోకు ఎలా పాల్పడ్డాడో అందరికీ తెలుసు. లేని రోడ్లకే గ్రాఫిక్కులు చూపించి స్కామ్‌ చేసినోడు.. ఇక, ఉన్న రోడ్లను చూపెట్టి ఎంత దండుకుంటాడో అనేదీ అందరూ ఆలోచన చేయాలన్నారు. తండ్రీకొడుకులు కలిసి క్విడ్‌ప్రోకోకు పాల్పడి ఈ రాష్ట్ర సంపదను అడ్డంగా దోచుకుని ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో అందరికీ అవగాహన కావాల్సిన సమయమిదని అన్నారు.

నిన్న లోకేశ్‌ మేకపోతు గాంభీర్యం నటిస్తూ .. వచ్చే ఆర్నెల్లలో మా నాయకుడు జగన్ కి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని చెప్పడాన్ని విని అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికి దొంగల్లా పారిపోయి ఢిల్లీలో దాక్కున వ్యక్తి రిటర్న్‌ గిఫ్టుల గురించి మాట్లాడటమా..? ఏపీకి రిటర్న్‌ రావడానికే భయపడుతున్న వ్యక్తి లోకేశ్‌ అనేది.. అందరి నోటా వినిపిస్తున్న మాట. భయాన్ని పరిచయం చేస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఈరోజు కాళ్ల దగ్గర్నుంచీ కళ్లవరకు భయంతో నిలువెల్లా వణికిపోతున్నాడని అన్నారు. ఎక్కడ ఎవరు తనను చూస్తారో.. ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనని గజగజ వణుకుతూ ఢిల్లీ రోడ్లమీద దొంగలా తిరుగుతున్న లోకేశ్‌ను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఎర్రడైరీలో తనకు నచ్చని వారి పేర్లు రాసుకుంటానని నిన్నటిదాకా బెదిరించిన లోకేశ్ పేరు.. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లలో నమోదైంద‌ని అన్నారు.

Updated On 27 Sep 2023 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story