Punganur Incident : పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన మంత్రి
చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులను చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో శనివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జరిగిన సంఘటన బాధాకరం అన్నారు.
చిత్తూరు(Chittoor) జిల్లా పుంగనూరు(Punganur) ఘటనలో గాయపడ్డ పోలీసుల(Police)ను చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో శనివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(MInister Peddireddy Ramchandrareddy) పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జరిగిన సంఘటన బాధాకరం అన్నారు. పోలీసులు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్, ఎస్సీ రిషాంత్ రెడ్డి(Rishanth Reddy), చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు(Srinivasulu), ఎం.ఎస్.బాబు(MS Babu), చిత్తూరు నగర మేయర్ అముద, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఇదిలావుంటే.. శుక్రవారం పుంగనూరు రణరంగంగా మారింది. చంద్రబాబు(Chandrababu) పర్యటనలో హై టెన్షన్(High Tension) వాతావరణం నెలకొంది. టీడీపీ(TDP), వైసీపీ(YSRCP) కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ ప్రకారమే పుంగనూరులో ఘర్షణలు జరిగాయన్నారు. మారణాయుదాలతో రౌడీలు దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తే ఎవరూ సహించరని చెప్పారు. చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలని మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.
పుంగనూరు ఘటనపై జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమతిచ్చిన రూట్‌లో కాకుండా చంద్రబాబు మరో మార్గంలో వచ్చారని ఆయన తెలిపారు. రౌడీ మూకలు ఉద్దేశపూర్వకంగానే అల్లర్లకు యత్నించారన్నారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారని చెప్పారు. మూకల దాడిలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. పోలీసు వాహనాలను తగులబెట్టిన వారిని గుర్తిస్తున్నామని ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు.