సీఎం వైఎస్ జగన్ 2.7 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదలకు అందించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

సీఎం వైఎస్ జగన్ 2.7 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదలకు అందించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 99 శాతం కు పైగా ఎన్నికల హామీలు వైఎస్ జగన్ అమలు చేశారని.. లబ్ధిదారులు, పేదలు అందరూ ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్ కు స్టార్ కాంపెయినర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి, సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారని.. ఐదేళ్ళ కష్టానికి ప్రతిఫలంగా సీఎం వైఎస్ జగన్ కు మనం అందించేది ఒక ఓటు మాత్రమేన‌న్నారు.

అంతా స్టార్ క్యంపెయినర్లుగా ముందుకు వచ్చి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని పిలుపునిచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి చంద్రబాబు ఏమి చేశారు? అని ప్ర‌శ్నించారు. హంద్రీనీవా కాలువ పూర్తి చేసి కుప్పం కు నీరు అందించినా.. చంద్రబాబు అండ్ కో విమర్శలు చేస్తున్నారని మండిప‌డ్డారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు, మేము రెవెన్యూ సబ్ డివిజన్ ను ఏర్పాటు చేశామ‌ని తెలియ‌జేశారు. ఎంపీ శ్రీ రెడ్డప్ప కుప్పం ప్రాంతంలో 35 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేయించారని.. ఐదేళ్ళ పాటు కుప్పంలో భరత్ చాలా కష్టపడ్డారని.. కుప్పంలో ఒక బీసీ ను గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది. భరత్ గెలిస్తే మంత్రి అవుతారు.. ఒక్క సారి బీసీ నియోజకవర్గమైన కుప్పం లో మాకు ఓటు వేయాలని కోరారు. పాలార్ తో పాటు మరో రెండు రిజర్వాయర్లకు ఇప్పటికే అనుమతి లభించింది. ఎన్నికలు పూర్తి అయ్యాక రెండేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కుప్పం ప్రజలందరూ ఎమ్మెల్యేగా శ్రీ భరత్ ను, ఎంపీగా శ్రీ రెడ్డప్ప ను గెలిపించాలని విజ్క్ష‌ప్తి చేశారు.

Updated On 7 May 2024 5:27 AM GMT
Yagnik

Yagnik

Next Story