Peddireddy Ramachandreddy : ఆ హక్కు చంద్రబాబుకు లేదు.. 17 సార్లు జీవోలు ఇచ్చారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఇసుక మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandreddy) మండిపడ్డారు. ఇసుక(Sand) మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 17 సార్లు ఇసుక పాలసీలపై జీవోలు ఇచ్చాడని.. చంద్రబాబు హయాంలో ఇసుకను పెద్ద మొత్తంలో దోపిడీ చేశారని వివరించారు. చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట వద్దే పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా చేశారని.. ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్న వనజాక్షిని కొట్టింది చంద్రబాబు హయాంలోనే అని గుర్తు చేశారు. వనజాక్షి(Vanjakshi), చింతమనేని(Chinthamaneni Prabhakar)ని పిలిచి చంద్రబాబు పంచాయితీ కూడా చేశాడని అన్నారు. వంశధార(Vamshdhara), నాగావళి(Naagavali), పెన్నా(Penna) నదుల్లో కూడా ఇసుకను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారనిఅన్నారు. ప్రతీ నెల ఇసుక మీద నారా లోకేష్ ముడుపులు తీసుకునేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దొంగ ఓట్లపై కూడా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. టీడీపీ(TDP) హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారని. చంద్రబాబు హయాంలో 60లక్షల దొంగ ఓట్లను చేర్పించారు. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో 12వేల దొంగ ఓట్లు(Fake Votes) గుర్తించామన్నారు. కుప్పంలో ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయని.. వాటి మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. 2018లోనే 60 లక్షల ఓట్లు చేర్పించారని.. దొంగ ఓట్లను కాపాడుకోవడం కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.