Minister Peddireddy Rama Chandra Reddy : ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వచ్చేది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వచ్చేది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు.

Minister Peddireddy Rama Chandra Reddy Comments on Chandrababu
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వచ్చేది జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రభుత్వమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Rama Chandra Reddy) తేల్చి చెప్పారు. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్(PLR Convention) సెంటర్ లో సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఫిబ్రవరి 3న అనంతపురంలో జరిగే 'సిద్ధం' కార్యక్రమ పోస్టర్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం అయ్యాయని.. చంద్రబాబు(Chandrababu) కాంగ్రెస్(Congress) ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. ఆమెపై గౌరవం ఉంది.. కానీ, ఆమె చంద్రబాబు చేసే విమర్శలే చేస్తున్నారని అన్నారు.
పీలేరు సభలో చంద్రబాబు అన్నీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని.. ఇలాంటి వ్యక్తి మన జిల్లాలో ఎలా పుట్టాడోనని అన్నారు పెద్దిరెడ్డి. చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్నీ అబద్ధాలేనన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలో లేనప్పుడు మరోమాట చంద్రబాబు నైజం అన్నారు. మన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఇచ్చిన ప్రతి హమీ, మ్యానిఫెస్టోలో చెప్పి ప్రతి హామీ 99 శాతం అమలు చేశారన్నారు పెద్దిరెడ్డి. మన రాష్ట్రంలో విద్య, వైద్యం కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్ అని అన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోడానికి చంద్రబాబుకు ఏదీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదన్నారు. అసలు కుప్పం నుంచి ఆయన పోటీ చేయకపోవచ్చని అన్నారు చంద్రబాబు నాయుడు.
