ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం మరో పథకాన్ని మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు నారా లోకేష్.

ఆంధ్ర ప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న 1,48,419 మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజనం అందించనుంది ప్రభుత్వం. 475 కాలేజీల్లో 77 కాలేజీలకు కిచెన్ సదుపాయం ఉంది. మిగితా 398 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల నుండి భోజనం తయారు చేసి విద్యార్థులకు అందిస్తారు.

ehatv

ehatv

Next Story