రెడ్ బుక్‌పై మంత్రి నారా లోకేష్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను అని ఆయ‌న అన్నారు.

రెడ్ బుక్‌పై మంత్రి నారా లోకేష్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను అని ఆయ‌న అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్‌లో చేర్చామ‌న్నారు. రెడ్ బుక్ అంటే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదన్నారు. నేను ప్రతి మీటింగ్ లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పానని.. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలనే తీర్పు ఇచ్చారన్నారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేసాడు.. వదిలేయాలా.? అని ప్ర‌శ్నించారు. రేపు లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని అన్నారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story