Minister KTR-Chandrababu : చంద్రబాబును పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ నేతలు!
మధ్యంతర బెయిల్(Interim Bail) మీద జైలు నుంచి బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత(TDP) చంద్రబాబునాయుడును(Chandrababu) పరామర్శించడానికి బీఆర్‌ఎస్(BRS) సంసిద్ధమవుతున్నదని తెలిసింది. అయితే చంద్రబాబు దగ్గరకు ఏ స్థాయి లీడర్‌ను పంపాలనే అంశంపైనే చర్చ జరుగుతున్నదట! బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) వెళ్లవచ్చని తెలిసింది.
మధ్యంతర బెయిల్(Interim Bail) మీద జైలు నుంచి బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత(TDP) చంద్రబాబునాయుడును(Chandrababu) పరామర్శించడానికి బీఆర్‌ఎస్(BRS) సంసిద్ధమవుతున్నదని తెలిసింది. అయితే చంద్రబాబు దగ్గరకు ఏ స్థాయి లీడర్‌ను పంపాలనే అంశంపైనే చర్చ జరుగుతున్నదట! బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) వెళ్లవచ్చని తెలిసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఆందోళన చేశారు. ఈ విషయంపై కేటీఆర్ స్పందించిన తీరు సెటిలర్లకు, ముఖ్యంగా తెలుగుదేశంపార్టీ అభిమానులకు, మరీ ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రాబోయే ఎన్నికల్లో సెటిలర్లలోని ఓ వర్గం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్న బీఆర్‌ఎస్ నష్ట నివారణ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబును పరామర్శించకపోతే టీడీపీని అభిమానించే సెటిలర్లలో మరింత వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించిన బీఆర్‌ఎస్ బాబు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. పరామర్శకు కేటీఆర్ వెళతారని సమాచారం. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్(Mangati Gopinath), అరికపూడి గాంధీలు(Arikapudi gandhi) కూడా వెళతారట!