Minister KTR : చంద్రబాబు అక్కడ అరెస్టైతే.. ఇక్కడ ధర్నాలు చేస్తే ఎలా.?
చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest), ఏపీ రాజకీయ పరిణామాలపై మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతుంది రెండు పార్టీల మధ్య ఘర్షణ.. దానికి మేము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు.

Minister KTR
చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest), ఏపీ రాజకీయ పరిణామాలపై మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతుంది రెండు పార్టీల మధ్య ఘర్షణ.. దానికి మేము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు ఆంధ్రలో అరెస్ట్ అయితే అక్కడ ధర్నాలు చేయాలి కానీ.. ఇక్కడ ధర్నాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పక్కింట్లో పంచాయితీ అయితే ఇక్కడ తీర్చుకుంటాం అంటే ఎలా అని ఫైర్ అయ్యారు.
ఏపీలో(AP) తనకు ఎవరితోనూ గొడవలు లేవన్నారు. జగన్(Jagan), లోకేష్(Lokesh), పవన్(Pawan Kalyan) అందరూ తన మిత్రులేనన్నారు. ఓ ఫ్రెండ్ ద్వారా లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అడిగారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనే ఐటీ ఆక్టివిటీ దెబ్బతినకూడదని ఐటీ కారిడార్లో ర్యాలీ చేయలేదని.. అప్పటి ప్రభుత్వాలు కూడా అడ్డుకున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు చేశారని.. రేపు ఇంకొకరు చేస్తారు.. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడవలసిన బాధ్యత మా మీద ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రజలు అందరూ పదేళ్ల నుండి ప్రశాంతంగా ఉన్నారు.. లేని చిచ్చు పెడతామంటే ఎలా అని ప్రశ్నించారు.
