ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు(Andhra Pradesh) ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) డిమాండ్ చేశారు. ఢిల్లీలో(Delhi) ఆయ‌న మీడియాతో(Media) మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు(Andhra Pradesh) ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) డిమాండ్ చేశారు. ఢిల్లీలో(Delhi) ఆయ‌న మీడియాతో(Media) మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై(special status) ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌(Manmohan Singh) హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని పార్లమెంట్‌లో(Parliament) ప్రత్యేకహోదా హామీ ఇచ్చారు. విభజన వేళ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరమ‌న్నారు.

ఢిల్లీ తెలంగాణ భవన్‌పై(Telangana Bhavan) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ నిర్వహించారు. 19 ఎకరాల ఉమ్మడి ఏపీ భూమిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సైట్ ఇన్ఫెక్షన్ చేస్తామన్నారు. ఎల్లుండి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఉమ్మడి భవన్ ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదని అన్నారు. మార్చిలోపు భవన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated On 12 Dec 2023 4:07 AM GMT
Ehatv

Ehatv

Next Story