Minister Kakani Comments On Chandrababu : చంద్రబాబు దొంగ అని సొంతోళ్లే తేల్చారు
టీడీపీ(TDP) ఈ రాష్ట్రంలో అనవసరమైన రాద్ధాంతాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాస్తవాల్ని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మాపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి(State Agriculture Minister) కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Kakani Goverdhan Reddy) అన్నారు.
టీడీపీ(TDP) ఈ రాష్ట్రంలో అనవసరమైన రాద్ధాంతాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాస్తవాల్ని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మాపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి(State Agriculture Minister) కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest) గురించి అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే.. టీడీపీ నేతలే అసలు నిజాల్ని అంగీకరించారు. ఆమేరకు మేము తప్పులు చేసిన మాట వాస్తవమేనని.. ఆ పార్టీ ప్రజలకు చెప్పుకుంటుందని తెలిపారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో(Skill Development Scam) తప్పు జరిగింది కానీ.. అందులో మా చంద్రబాబు పాత్ర కొంతే.. ఇంతే.. అని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజాల్ని ఒప్పుకోవడమనేది ఒకరకంగా మంచి సాంప్రదాయమేనన్నారు. తమ అధినేత చంద్రబాబుపై అవినీతి మచ్చ పడిందని.. ఎలాగైనా ఆ మచ్చను చెరిపేయాలనే ప్రయత్నంలో భాగంగా టీడీపీ నేతలు, వారి పార్టీని భుజానెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా నానా తంటాలు పడుతుంది. అందులో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు వాటి పచ్చఛానెళ్లల్లో రోజుకో కథనాల్ని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, వాళ్ల ప్రయత్నాలు మాత్రం ఎక్కడా ఫలించడంలేదు. ఈ తంతు మొత్తాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
స్కిల్‌స్కామ్‌లో సీమెన్స్ సంస్థ పేరిట ఒప్పందం చేసుకుని ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదల చేసిందని.. ఆ మొత్తంలో రూ.241 కోట్లు షెల్ కంపెనీలతో చంద్రబాబు ఖాతాలో చేరిందనేది వాస్తవాధారం. అయితే.. ఆయన వర్గం మాత్రం రాష్ట్రంలో కొనసాగుతున్న స్కిల్ సెంటర్లు, వాటిల్లో పరికరాలన్నీ సీమెన్స్ కంపెనీనే కొనుగోలు చేసిందని చెప్పడానికి ప్రయత్నించారు. టీడీపీ నేతలు విక్రమసింహపురి యూనివర్శిటీకి వెళ్లి అక్కడ స్కిల్‌సెంటర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఏవేవో కబుర్లు చెప్పారు. తీరా.. అక్కడున్న ల్యాబ్ పరికరాలకు సీమెన్స్ సంస్థకు సంబంధమే లేదని ఆధారాల్ని చూపించాం. ఆ తర్వాత ఆదిశంకర సంస్థలకు వెళ్లి అక్కడ రూ.10 కోట్లతో సీమెన్స్ ఏర్పాటు చేసిన స్కిల్‌సెంటరన్నారు. సరేనని.. అక్కడకెళ్లి చూస్తే అసలు విషయం తేలిందన్నారు.
2017 జూన్ 30న ప్రభుత్వ జీవో నెంబర్.4 ప్రకారం ‘సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ’ పేరుతో 90- 10 శాతం వాటాగా పేర్కొన్నారు. సీమెన్స్ నకిలీ కంపెనీ పేరుతో స్కామ్ చేశారు. ఒక్కోసెంటర్‌కు రూ.80 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి, టీడీపీ నేతలే ఆదిశంకరలో కేవలం రూ.10 కోట్లే ఖర్చుపెట్టి స్కిల్‌సెంటర్ పెట్టారని చెబుతున్నారు గదా..? మరి, మిగతా రూ.70 కోట్లు ఎక్కడకు పోయాయి..? ఎవరి ఖాతాలోకి చేరాయి..? దీనికి సమాధానం చెప్పాలని టీడీపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు.