టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేన ఛీప్ పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టును రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. పెత్తందారులు కాబట్టే వారికి ఎవరూ అండగా నిలబడటం లేదన్నారు. చంద్రబాబు ఏనాడు ఎవరికీ అండగా నిలబడలేదన్నారు. పెత్తందారుల పక్షాన జనసేనాని పవన్ కల్యాణ్ పాలేరులా మారాడని తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. ఇంగ్లీష్ మీడియంపై ప‌వ‌న్‌ అర్థం పర్థం లేని విమర్శలు […]

టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేన ఛీప్ పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టును రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు. పెత్తందారులు కాబట్టే వారికి ఎవరూ అండగా నిలబడటం లేదన్నారు. చంద్రబాబు ఏనాడు ఎవరికీ అండగా నిలబడలేదన్నారు. పెత్తందారుల పక్షాన జనసేనాని పవన్ కల్యాణ్ పాలేరులా మారాడని తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. ఇంగ్లీష్ మీడియంపై ప‌వ‌న్‌ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నార‌ని మండిప‌డ్డారు. చేతకాని చవట సన్నాసులంతా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారన్నారని నిప్పులు చెరిగారు.

గత టీడీపీ (TDP) ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. కానీ నేడు జగన్ (CM Jagan) పాలన సువర్ణయుగంగా ఉందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నిజాయతీపరుడంటూ కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని విమ‌ర్శించారు. ఆవు దూడ మీద, దూడ ఆవు మీద చెప్పినట్లుగా చంద్రబాబు, లోకేశ్‌ల(Lokesh) ప్రవర్తన ఉందన్నారు. అసలు తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని సవాల్ విసిరారు.

Updated On 21 Oct 2023 6:27 AM
bodapati ashok

bodapati ashok

Next Story