గృహ నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. బుధవారం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ 45 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గృహ నిర్మాణం(Housing)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) తెలిపారు. బుధవారం విజయవాడ(Vijayawada) ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ 45 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఏర్పాటైన 45 ఏళ్లలో ఏపీ(AP)లో దాదాపు 80 లక్షల ఇళ్లను నిర్మించడం గొప్ప విషయమన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం క్రింద 1 కోటి 19 లక్షల ఇళ్లు మంజూరు కాగా.. అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 21 లక్షల గృహాలు మంజూరు కావడం ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ఘనత అన్నారు. 2 ఏళ్లు కరోనా విపత్తు కారణంగా ప్రజల సంక్షేమం, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం ఆ తర్వాతి రెండేళ్లలోనే 25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 5 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయనున్నామన్నారు. చరిత్రలో ఒకేసారి ఇన్ని ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసే అరుదైన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయని, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి, కన్నీళ్లు తుడిచి, బాధలు విని దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పేదవారికి వారి సొంతింటి(Own House) కలను నెరవేర్చడం ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందన్నారు. పేదవారికి నీడ, భరోసా ఇవ్వడంలో 45 ఏళ్లుగా అహర్నిశలు కృషి చేసిన గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.

Updated On 5 July 2023 8:26 PM GMT
Yagnik

Yagnik

Next Story