Minister Jogi Ramesh : చంద్రబాబు, పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రి జోగి రమేశ్
ఏపీ మంత్రి జోగి రమేశ్(jogi ramesh) ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan kalyan) లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముసలి నక్క, పవన్ కల్యాణ్ ను పిచ్చి కుక్క తో పోల్చుతూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా చాలా మార్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Minister Jogi Ramesh
ఏపీ మంత్రి జోగి రమేశ్(jogi ramesh) ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan kalyan) లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముసలి నక్క, పవన్ కల్యాణ్ ను పిచ్చి కుక్క తో పోల్చుతూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా చాలా మార్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్చడం, తార్చడం పవన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి కంపెనీ పెట్టు.. ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను ఉద్దేశించి.. ఊరపంది తిరిగినట్టు ఒకడు రోడ్లపై తీరుగుతున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నారని, గూడు కల్పిస్తున్నారని అన్నారు. మా అన్న జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరని అన్నారు. అమరావతిలో 50 వేల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారని చెప్పారు. పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. పెత్తందారుల కోటలు బద్దలు కొట్టామని చెప్పారు. రాజధానిలో పేదలు నివసించకూడదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నారని తెలిపారు. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసించారు.
