వారాహి యాత్రపై దాడి చేసే అవకాశం ఉందంటూ పవన్‌కళ్యాణ్‌ నిస్సిగ్గుగా చేసిన పిచ్చి వ్యాఖ్యలను పెడన ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారని మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు.

వారాహి యాత్ర(Varahi Yatra)పై దాడి చేసే అవకాశం ఉందంటూ పవన్‌కళ్యాణ్‌(Pawan Kalyan) నిస్సిగ్గుగా చేసిన పిచ్చి వ్యాఖ్యలను పెడన ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారని మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) ఫైర్ అయ్యారు. నాడు అంగళ్లు సెంటర్‌లో దత్తతండ్రి చంద్రబాబు ఏవిధంగానైతే కుట్ర చేసి కుయుక్తులతో అల్లర్లు సృష్టించాడో.. అదే తరహాలో పెడనలో కూడా ఘటనలకు పవన్‌ పార్టీ కార్యకర్తలను పురి గొల్పుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాడు అంగళ్లులో పోలీసులపై చంద్రబాబు మనుషులు ఏ విధంగా దాడులు చేశారో.. వారి వాహనాలను తగలబెట్టారో అందరూ చూశారని.. ఆ దత్తతండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆయన మాస్టర్‌ప్లాన్‌ స్కెచ్‌ ప్రకారమే.. పవన్‌కళ్యాణ్‌ ముందస్తు హెచ్చరికలకు పాల్పడ్డారనేది అందరికీ అర్ధమౌతుందన్నారు. వారి దుష్టాలోచన ప్రకారం పెడనలో గొడవలు సృష్టించి, శాంతిభద్రతల సమస్యల్ని లేవనెత్తి కొందరు అమాయక జనసేన కార్యకర్తల్ని గాయపరచాలనే కుట్రపూరిత ఆలోచన పవన్‌ మాటల్లో కనిపిస్తోందని అన్నారు.

చంద్రబాబు(Chandrababu), పవన్‌కళ్యాణ్‌ మాదిరిగా పార్టీ కేడర్‌ను హింసకు ప్రోత్సహించే మనస్తత్వం మాది కాదన్నారు. దమ్ము, ధైర్యం ఉన్న‌ జగన్ నాయకత్వంలో నీతిమంతమైన రాజకీయం నేర్చుకున్న వాళ్లం. మాకు కుట్రలు, కుతంత్రాలు చేయడం రాదు. కేవలం, ప్రజలకు మంచి చేయడం, వారి దగ్గర్నుంచి ఆదరణ పొందడమే మాకు తెలిసిన విద్య. డెల్టా ప్రాంతమంటే నీకెలా కనిపిస్తున్నారు పవన్‌కళ్యాణ్‌? పెడన నియోజకవర్గం ప్రజలంటే శాంతికాముకులు. అలాంటి వాళ్లు నిన్ను అడ్డుకోవడానికి, నీ సభను చెదరగొట్టడానికి కత్తులు, రాడ్లతో దాడులు చేస్తారని అంటావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? అని నిప్పులు చెరిగారు.

అనిగడ్డ(Avanigadda)లో సభ ఎటూ అట్టర్‌ఫ్లాప్‌(Utterflop) అయ్యింది కనుక పెడనలోనూ అదే పరిస్థితి ఉంటుందేమోనని ఊహించి జనాల్ని రెచ్చగొట్టే సినిమా స్కెచ్‌ వేస్తున్నావా..? లేకపోతే, పెడన(Pedana) నియోజకవర్గ ప్రజలపై ఈ నిందలేంటి..? నీ రెచ్చగొట్టే రాజకీయాల్ని పెడనలో చూపించాలనుకుంటే, అది సాధ్యం కాని పని. ఈ విషయం పవన్‌ తెలుసుకోవాలి. బుధవారం పెడన సభలో తనపై దాడి జరిగే అవకాశం ఉందంటున్న పవన్‌కళ్యాణ్‌.. అందుకు ఆధారాలు ఉంటే చూపించగలరా? ఆ దమ్ము నీకుందా పవన్‌?. అని ప్ర‌శ్నించారు.

పవన్‌కళ్యాణ్‌ను నేను ఛాలెంజ్‌(Challenge) చేస్తున్నాను. నీవు చేస్తున్న ఆరోపణలను నిరూపించి చూపితే.. నీ వారాహి యాత్రకు నేనే స్వయంగా వచ్చి వీధి వీధి తిరిగి నీమీద చిన్న ఈగ కూడా వాలకుండా చూస్తాను. నా నియోజకవర్గం నుంచి నిన్ను పూర్తి సేఫ్‌గా దాటిస్తాను. మరి నా సవాల్‌ స్వీకరిస్తావా?. అని జోగి ర‌మేష్ వ్యాఖ్యానించారు.

Updated On 3 Oct 2023 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story