తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మతి చెడిందని మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్‌హౌస్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నాడు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌(Pawan Kayan) మతి చెడిందని మంత్రి గుడివాడ అమరనాథ్(Minister Gudivada Amarnath) అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్‌హౌస్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీకి తెలంగాణలో దక్కిన ఓట్లశాతం చూసి అతను మతిస్థిమితం కోల్పోయాడేమోనని ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. కనీనం, స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా తన పార్టీకి రాలేదనే మనస్తాపం పవన్‌కళ్యాణ్‌ను వెంటాడుతుందేమో.. కారణాలేమైనా.. నిన్న విశాఖపట్నంలో ఆయన ప్రసంగం తీరుకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

ఎన్నికల బరిలో నిలబడే ఏ వ్యక్తికైనా.. రాజకీయ పార్టీకైనా ఒక స్థాయి, బలం ఉంటుంది. ఎన్నికల ఫలితాలనే ఆ రాజకీయ పార్టీ నాయకుడి స్థాయి, అతని నాయకత్వ బలానికి కొలమానంగా చూస్తారు. దీన్నిబట్టి చూస్తే.. పవన్‌కళ్యాణ్‌ కన్నా బర్రెలక్కనే నయమనిపిస్తుంది. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆమె బలం కన్నా జనసేన పార్టీ చాలా వీక్‌గా కనిపించింది. అతని నాయకత్వ బలం పేలవమని.. ఎన్నికల బరిలో నిలబడే స్థాయి ఆపార్టీకి లేదని తేటతెల్లమైంది. కనుకనే.. ఆయ‌న‌ ఈ రాష్ట్రంలో పర్యటించిన ప్రతీచోటా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రభుత్వ పరిపాలనను విమర్శిస్తూ ప్రజల్లో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇందులో భాగంగానే ఆయన నిన్న విశాఖపట్నంలో ప్రభుత్వం మీద, సీఎం జగన్ పై ఇష్టానుసారంగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు. ఆయన మాటల్ని వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము, ప్రజలు కూడా ఖండిస్తున్నారని అన్నారు.

Updated On 8 Dec 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story