Gudivada Amarnath : పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలేస్తుంది
విశాఖ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పవన్ ఆయన దత్త తండ్రి చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆలోచనతో ప్రసంగించారని అన్నారు.

Minister Gudivada Amarnath criticized Pawan Kalyan
విశాఖ(Vizag) వేదికగా వారాహి యాత్ర(Varahi Yatra)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) స్పందించారు. పవన్ ఆయన దత్త తండ్రి చంద్రబాబు(Chandrababu) మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆలోచనతో ప్రసంగించారని అన్నారు. పవన్ కళ్యాణ్ సంసారం బీజేపీ(BJP)తో సహజీవనం టీడీపీ(TDP)తో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అహంకారం, అసూయతో పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా సీఎం జగన్‌పై అసత్య వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జనసేన పార్టీ గురించి గానీ.. పవన్ రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన ఆయన ప్రసంగంలో లేదని అన్నారు.
సిద్ధాంతం, విధానం.. రానున్న ఎన్నికల్లో పోటీ ప్రణాళిక పవన్ లో కనిపించలేదన్నారు. అల్పుడు ఆడంబరంగా మాట్లాడునన్న వేమన పద్యం పవన్ కు సరిగ్గా సరిపోతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే జాలి వేస్తుందని కామెంట్ చేశారు.జగన్ మోహన్ రెడ్డి(YS Jagan)ని విమర్శిస్తే నాయకుడు అయిపోతారని అనుకుంటున్నారని అన్నారు. సినిమాల్లో కథానాయకుడుగా మీ తీరు బాగుండొచ్చు కానీ.. రాజకీయాల్లో తగదని సూచించారు. పవన్ కళ్యాణ్ కు సిద్దాంతాలు లేవు.. ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ తో పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు.
