టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై(chandrababu)మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్(Amar Nath) విమర్శలు గుప్పించారు. ఐటీ శాఖ(IT Department) ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తేలు కుట్టిన దొంగ‌లా ఎందుకు దాక్కున్నారు అంటూ చంద్రబాబు గారూ అంటూ మీడియాముఖంగా నిల‌దీశారు.

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుపై(chandrababu)మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్(Amarnath) విమర్శలు గుప్పించారు. ఐటీ శాఖ(IT Department) ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తేలు కుట్టిన దొంగ‌లా ఎందుకు దాక్కున్నారు అంటూ చంద్రబాబు గారూ అంటూ మీడియాముఖంగా నిల‌దీశారు. చంద్రబాబుది చీక‌టి చ‌రిత్ర అని అన్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయంగా, ఆర్ధికంగా ఎదిగిన తీరు అంద‌రికీ తెలుస‌న్నారు. చంద్ర‌బాబు జీవితం అంతా అవినీతి, కుట్ర‌లు కుతంత్రాలే అని అన్నారు. దేశ చ‌రిత్ర‌లో ఏ నాయ‌కుడి మీద కూడా ఇన్ని ఆరోప‌ణ‌లు రాలేద‌న్నారు. చంద్ర‌బాబు నేరుగా వ‌చ్చి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎద‌గ‌లేద‌ని.. ఆయ‌న‌ బ్యాక్ డోర్ పొలిటీషియ‌న్ అని అన్నారు.

ఆయ‌న పుట్టిన నావా వారి ప‌ల్లె నుంచి ఆయ‌న ఎదిగిన జాబ్లీహిల్స్ ప్యాలెస్ వ‌ర‌కూ.. ఆయ‌న సామ్రాజ్య‌మంతా అవినీతి సామ్రాజ్యం అని అన్నారు. అవినీతి పునాదుల మీద, వెన్నుపోటు రాజ‌కీయాల మీద ఆయ‌న ఎద‌గిన తీరు అంద‌రూ చూశార‌న్నారు. రూ. 118 కోట్లు చాలా చిన్న తీగ మాత్రమేనని.. పెద్ద డొంక ఉందని అన్నారు. నోటీసులో లోకేశ్ పేరు కూడా ఉందని చెప్పారు. సీమన్స్ కంపెనీ రూ. 3 వేల కోట్ల స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, జైలు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఈడీ(ED) కూడా కలగజేసుకోవాలని చెప్పారు.

Updated On 4 Sep 2023 3:04 AM GMT
Ehatv

Ehatv

Next Story