ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం వారిని రెన్యువల్‌ చేయలేదన్నారు. 2023 సెప్టెంబర్‌ నుంచి వ్యవస్థలో లేనివారికి జీతాలు ఎలా చెల్లించాలన్నారు. వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఇక లేనట్లేనని సమాచారం. గతంలో పవన్‌ కల్యాణ్‌ కూడా వాలంటీర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను కొనసాగించడానికైనా.. రద్దు చేయడానికైనా అసలు వాళ్లు జీవోలోనే ఎక్కడా లేరు. గత వైసీపీ ప్రభుత్వమే వాలంటీర్లకు చాలా అన్యాయంగా చేసిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అయితే వాలంటీర్ల జీతం 10 వేలకు పెంచుతామని ఎందుకు అన్నారని బొత్స ప్రశ్నించారు. అప్పుడు మీకు ఈ విషయాలు తెలియకుండానే వాలంటీర్లకు హామీ ఇచ్చారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ehatv

ehatv

Next Story