Minister Dharmana Prasada Rao : మన గుర్తు సైకిల్ అని అంటున్నారు.. మంత్రి ధర్మాన ఆవేదన
వచ్చే ఎన్నికల్లోనూ(Elections) వైసీపీనే(YCP) గెలిపిస్తామని చెబుతున్నారని, కానీ చాలామంది మన గుర్తు ఏదంటే మాత్రం సైకిల్(Cycle symbol) అంటున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని జ్యోతిబా పూలే కాలనీలో(Jyotiba Poole Colony) నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని అన్నారు.

Minister Dharmana Prasada Rao
మన గుర్తు సైకిల్ అని అంటున్నారు.. మంత్రి ధర్మాన ఆవేదన
అందరికీ మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలనే ఉందన్న మంత్రి
మన దగ్గర సరిపడా కరెంటు లేకపోవడం వల్లే కోతలు విధించామన్న ధర్మాన
శ్రీకాకుళంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లోనూ(Elections) వైసీపీనే(YCP) గెలిపిస్తామని చెబుతున్నారని, కానీ చాలామంది మన గుర్తు ఏదంటే మాత్రం సైకిల్(Cycle symbol) అంటున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని జ్యోతిబా పూలే కాలనీలో(Jyotiba Poole Colony) నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని అన్నారు. మీరు ఓటు వేసి గెలిపిస్తే వచ్చేసారీ అధికారంలోకి వస్తామని, వద్దనుకుంటే దిగిపోతామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛనుతో హాయిగా ఉన్నామని చాలామంది చెబుతున్నారని, మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) గెలిపిస్తామనే అంటున్నారనీ, కానీ మన గుర్తు ఏదని అడిగితే మాత్రం సైకిల్ అంటున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ జగన్ మళ్లీ రావాలనే ఉందని, పథకాలన్నీ కొనసాగించాలనే ఉందని, కానీ గుర్తేంటో మాత్రం వారికి తెలియదని పేర్కొన్నారు. కాబట్టే ఈ అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. మన దగ్గర సరిపడా కరెంటు లేకపోవడంతో కోతలు విధించినట్టు చెప్పారు. అందుకనే బయటి నుంచి కొంటున్నట్టు తెలిపారు.
