నేటి నుంచి ఏపీ(AP)లో రెండు రోజుల ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియ మొదలైంది. ఈ నేప‌థ్యంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస(Minister Chelluboyina Srinivasa) వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతున్న కులగణన ప్రక్రియను పరిశీలించారు.

నేటి నుంచి ఏపీ(AP)లో రెండు రోజుల ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియ మొదలైంది. ఈ నేప‌థ్యంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస(Minister Chelluboyina Srinivasa) వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతున్న కులగణన ప్రక్రియను పరిశీలించారు. కులగణన ప్రక్రియ రాష్ట్రంలో మొదలు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం జ‌గ‌న్‌(CM Jagan) చిత్రపటానికి మంత్రి చెల్లుబోయిన పాలభిషేకం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యమనే మహాత్ముడి లక్ష్యాన్ని సాధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనగణన తప్ప కులగణన జరగలేదన్నారు. నేడు మన రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కులగణనతో సాధించబోతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉన్నతవర్గాలలోని పేదలతోపాటు, వెనుకబడిన వర్గాల, బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఈ కులగణన వెలుగులు నింపనుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

బిసీ సంక్షేమశాఖ మంత్రిగా నేనున‌ప్పుడు.. ఈ కులగణన జరగడం నా అదృష్టం అన్నారు. నాకు ఎంతో ఇష్టమైనది బీసీలకు సేవ చేసుకోవడం.. జగన్ నాకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం.. నా అదృష్టంగా భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు. సమగ్ర కులగణన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి జీవితానికి భద్రత అని వివ‌రించారు.

నేడు పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్న రెండు రోజుల కుల గణన పక్రియను నా నియోజకవర్గం నేలపర్తిపాడు గ్రామంలో పరిశీలించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ రెండు రోజుల పైలెట్ ప్రాజెక్టులో ఎలాంటి అంశాలు ఎదురవతున్నాయి.. వాటిని ఎలా పరిష్కారించాలనే వాటిపై అధ్యయనం చేస్తామ‌న్నారు. అధికారులకు కూడా ఏ చిన్న అంశం కూడా వదలకుండా కులగణన ప్రక్రియ జరపాలని సూచించడం జరిగిందని తెలిపారు.

పేదవాడి సొమ్మును ఎలా దోచుకోవాలో గత ప్రభుత్వం చూస్తే.. పేదవాడి సొమ్మును ఎలా పేదవారికి చేర్చాలో జగన్ చూస్తున్నారని.. అందుకు నిదర్శనమే ఈ కులగణన ప్రక్రియ అని తెలిపారు. కులగణన ద్వారా మా వర్గాల యొక్క మనోభావాలను రక్షించిన నాయకుడిగా జగన్ నిలిచారని పేర్కొన్నారు. కులగణన ప్రక్రియలో నన్ను కీలకంగా భాగస్వామ్యం చేసిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated On 15 Nov 2023 3:41 AM GMT
Ehatv

Ehatv

Next Story