Buggana Rajendranath : అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
అసెంబ్లీ సమావేశాల(Assembly Meetings) ఏర్పాట్లపై శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన 'విప్'(VIP) లతో చర్చించారు.

Buggana Rajendranath
అసెంబ్లీ సమావేశాల(Assembly Meetings) ఏర్పాట్లపై శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన 'విప్'(VIP) లతో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు శాసన సభ వ్యవహారాల కమిటీ సమావేశం, ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి చీఫ్ విప్ ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, విప్ లు జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
