Ambati Rambabu : దత్తపుత్రుడు నుంచి తమ్ముడు తెలుసుకో..మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్
సీఎం జగన్(CM Jagan) ని గద్దె దించడమే టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి ఏకైక లక్ష్యం. కానీ.. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల మధ్య కుతకుత మొదలైంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థులను ప్రకటించంపై జనసేనాని చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు(Chandrababu) ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రంగానైనా తనతో చర్చించకుండా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సీఎం జగన్(CM Jagan) ని గద్దె దించడమే టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి ఏకైక లక్ష్యం. కానీ.. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల మధ్య కుతకుత మొదలైంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థులను ప్రకటించంపై జనసేనాని చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు(Chandrababu) ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రంగానైనా తనతో చర్చించకుండా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ(YCP) సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu) రియాక్ట్ అయ్యారు. పవన్‌కు..మంత్రి రాంబాబు హితవుతో కూడిన సూచన చేశారు. ఈ మేరకు ఆసక్తికర ట్వీట్ చేశాడు. అయితే పవన్ కల్యాణ్ ని ఎప్పుడూ దత్తపుత్రడని సంభోదించే అంబటి..‘పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించని వాడే "బాబు".. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్!’’ అంటూ సంభోదించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘
అంతేకాదు..మంత్రి అంబటి మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు! గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు!’’ అంటూ లోకేష్(Lokesh) పాదయాత్రపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి వేసిన పంచ్ లకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంత త్వరగా మీకు టైమింగ్‌తో కౌంటర్ డైలాగ్స్ ఎలా వస్తాయి సార్ అంటూ ఫన్నీ రిప్లైలు ఇస్తున్నారు. మొత్తానికి.. తన ట్వీట్ ద్వారా..పవన్‌కల్యాణ్‌కు జ్ఞానోదయం చేసేందుకు అంబటి ప్రయత్నించారు. పవన్‌కు సంబంధించి ప్రతి చిన్న కదలికపై అంబటి తనదైన రీతిలో స్పందించే సంగతి తెలిసిందే. పవన్, అంబటి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. దీంతో తనపై అంబటి, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని తదితర తన సామాజిక వర్గ నేతలతో జగన్ విమర్శలు చేయిస్తుంటారని పవన్ వాపోతుంటారు. ఇప్పుడు పవన్‌ను టార్గెట్ చేయడానికే ఆయన ఆయుధం ఇచ్చారు. అంబటి హిత వచనాలను పవన్ కల్యాణ్ ఏ విధంగా తీసుకుంటారనేది చూడాలి మరి.. !
పొత్తు ధర్మమే కాదు
ఏ ధర్మము పాటించని వాడే "బాబు"
తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్!@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 26, 2024