Minister Ambati Rambabu : టీడీపీకి భవిష్యత్తు గ్యారెంటీ లేదు
భవిష్యత్తు గ్యారెంటీ లేని పార్టీ నీది చంద్రబాబూ అంటూ టీడీపీ అధినేతపై ఫైర్ అయ్యారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి. అంబటి రాంబాబు. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్ ని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కుమారుడు వయసున్న జగన్ పై ఆక్రోశాన్ని చూపిస్తున్నావు అంటే.. జగన్ అత్యంత బలశాలి, ఆయన్ను ఎదుర్కోలేకపోతున్నావని మీలో అసహనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Minister Ambati Rambabu Sensational Comments On Chandrababu
భవిష్యత్తు గ్యారెంటీ లేని పార్టీ నీది చంద్రబాబూ(Chandrababu) అంటూ టీడీపీ(TDP) అధినేతపై ఫైర్ అయ్యారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్(Jagan) ని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కుమారుడు వయసున్న జగన్ పై ఆక్రోశాన్ని చూపిస్తున్నావు అంటే.. జగన్ అత్యంత బలశాలి, ఆయన్ను ఎదుర్కోలేకపోతున్నావని మీలో అసహనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హామీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉన్న వారికి ఇబ్బంది కానీ.. అధికారంలోకి రాను అనుకునే వారు ఎన్నైనా వాగ్ధానాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకున్న చరిత్ర ఉన్నదా..? అని ప్రశ్నించారు. క్యాష్‌వార్(Cash War) చంద్రబాబుకే అలవాటు.. హైదరాబాద్(Hyderabad)లో డబ్బుతో ఓటును కొంటూ దొరికిపోయి పారిపోయి వచ్చారని.. క్యాష్ తో రాజకీయాలు చేయాలనుకుంటారు.. తప్ప తన శక్తితో రాజకీయాలు చేయాలనుకునే వ్యక్తి చంద్రబాబు కాదని విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుకు ఇదే మీకు చివరి మహానాడు(Mahanadu) అని మంత్రి అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్(Lokesh) చేతులమీదుగా టీడీపీకి కూడా నూరేళ్లు నిండుతాయి. 2019లోనే ప్రజలు దుర్మార్గమైన పరిపాలనను అంతం చేశారు. మళ్లీ అదే పాలనను తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం(Telugudesham) పార్టీ ఇంతటితో అంతరించి పోతుంది.. ఎన్నికల తర్వాత ఉండదనా ఘంటాపథంగా చెప్పారు. నీ సైకిల్(Cycle) తుప్పు పట్టిపోయింది.. నువ్వు తొక్కలేకపోతున్నావ్.. చివరికి మీ అబ్బాయి కూడా తొక్కలేకపోతున్నాడు.. అందుకే దత్తపుత్రుడితో తొక్కించుకోవాలి అనుకుంటున్నావ్ అని ఎద్దేవా చేశారు.
