Ambati Rambabu : యువగళం అట్టర్‌ఫ్లాప్.. లోకేశ్ ఒక్క అంగుళం కూడా ఎదగలేదు.!
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్రపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు సంధించారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Minister Ambati Rambabu satires on Yuvagalam Yatra
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం(Yuva Galam) యాత్రపై మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) సెటైర్లు సంధించారు. వైయస్సార్‌సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) కొడుకు లోకేశ్ యువగళం యాత్రలో నడిచాడంట!. రేపో, ఎల్లుండో యాత్ర పూర్తవుతుందని ఏదో సభ పెట్టారంట!. నిజంగా, అతను ఎన్ని కిలోమీటర్లు నడిచాడో గానీ.. లోకేశ్ ఒక్క అంగుళం కూడా ఎదగలేకపోయాడని విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం పెయిడ్ ఆర్టిస్టులతోనే యాత్రలు నడిపితే యువగళంలా అట్టర్‌ఫ్లాప్(Utterflop) అవుతాయన్నది రాజకీయాల్లో నిదర్శనంగా కనిపించిన విషయమన్నారు.
యువగళం ముగింపు సందర్భంగా లోకేశ్ తన తండ్రికి రెడ్‌బుక్(Red Book)ను గిఫ్ట్(Gift)గా ఇస్తాడంట. అందులో ఎవరెవరో పేర్లు రాశాడంట. ఎందుకు..? అది నాలుక గీసుకోవడానికీ పనికిరాని పుస్తకం అని ఎద్దేవా చేశారు. టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చేనా.. చచ్చేనా..? అని తీసిపడేశారు. అలాంటి పరిస్థితుల్లో రెడ్‌బుక్ తెచ్చి ప్రజల్ని ఏదో చేస్తామనే స్థితికి మీరు దిగజారిపోయారని అన్నారు. ఎటూ అధికారం కోల్పోతున్నామనే మీరు ఫ్రస్టేషన్‌లో విమర్శలు చేస్తన్నారని ప్రజలకు కూడా అర్ధమైందని వ్యాఖ్యానించారు.
