Minister Ambati Rambabu : జగన్ను ఓడించడం గురించి తప్ప.. ప్రజాసమస్యల గురించి సభలో మాట్లాడారా..?
యువగళం బహిరంగ సభపై మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) విమర్శనాస్త్రాలు సంధించారు. సత్తెనపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి బహిరంగ సభ తుస్సుమందన్నారు. ఆరు లక్షల మంది జనాలు వస్తారని మీరు ప్రచారం చేసుకుంటే.. ఎంతమంది వచ్చారో నిజాయితీగా సమాధానం చెబుతారా..?
యువగళం బహిరంగ సభపై మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) విమర్శనాస్త్రాలు సంధించారు. సత్తెనపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి బహిరంగ సభ తుస్సుమందన్నారు. ఆరు లక్షల మంది జనాలు వస్తారని మీరు ప్రచారం చేసుకుంటే.. ఎంతమంది వచ్చారో నిజాయితీగా సమాధానం చెబుతారా..? వచ్చిన వాళ్లు ఎంతసేపు ఉన్నారు..? ఎవరి ఉపన్యాసాలు విన్నారు..? మధ్యలోనే వాళ్లంతా ఎందుకు వెళ్లిపోయారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
యువగళం యాత్రలో 3,132 కిలోమీటర్లు నడిచిన నారా లోకేశ్ ఏం తెలుసుకున్నాడు, ఏం సాధించాడు..?. రాష్ట్రంలోని ఏ సమస్యల్ని ఆయన అర్ధం చేసుకున్నా డు..? తెలుసుకున్న సమస్యలకు ఆయన పరిష్కార మార్గాలు ఏం చెప్పాడు..? అంటే, ఏమీలేవు. అదేమంటే, ఇది యువగళం.. నవశకం అన్నారు.. లోకేశ్ కీలక పాత్రధారి అన్నారు. ఆయనేమో ఇది యువగళం ముగింపు సభనే కాదు.. యుద్ధం ఆరంభమైందని.. ఎన్నికల యుద్ధభేరీ మోగిస్తున్నామని అరిచాడు. అయితే, అక్కడేమీ భేరీ మోగలేదని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఒకే వేదికపై ఉండి నిర్వహించిన బహిరంగ సభ అని చెప్పుకున్నారు. అసలు, వారిద్దరూ ఎప్పుడు విడిపోయారు..? అని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఎప్పుడూ విడిపోలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏవిధంగా పోటీచేస్తే బాగుంటుందో.. ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారన్నారు. 2014లో ఆయనకు సపోర్టు చేశారు. 2019లో విడిపోయి పోటీచేస్తే చంద్రబాబుకు ఉపయోగం కలుగుతుందని అనుకుని విడిపోయి మరీ పోటీచేశారు. ఇవాళేమో.. ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసి పోటీచేస్తారంట.. జగన్‌ని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజాసమస్యల గురించి మీరు బహిరంగ సభలో మాట్లాడారా..? అని ప్రశ్నించారు.