Ambati Rambabu : పోలవరంపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలి
చంద్రబాబు చేసిన తప్పిదాలు ఈనాడుకు కనిపించడం లేదా..? అని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిత్యం 'ఈనాడు' అసత్య కథనాలు వండి వారుస్తుందని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై ఈనాడు దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లనే పోలవరం నిర్మాణంలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.

Minister Ambati Rambabu Fire On TDP
చంద్రబాబు(Chandrababu) చేసిన తప్పిదాలు ఈనాడు(Eenadu)కు కనిపించడం లేదా..? అని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ప్రశ్నించారు. నిత్యం 'ఈనాడు' అసత్య కథనాలు వండి వారుస్తుందని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)పై ఈనాడు దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లనే పోలవరం నిర్మాణంలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పిదాలు ఎల్లో మీడియాకు కనిపించలేదా..? అని ప్రశ్నించారు. టీడీపీ(TDP) హయాంలో తప్పిదాలు రామోజీకి కనిపించవా..? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2020 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరొకటి లేదని విమర్శించారు. తొలి దశ పనులకు కేంద్రం రూ.12,911 కోట్లు విడుదల చేసిందని.. అదనంగా రూ.5,127 కోట్లు విడుదల చేయాలని కోరామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్(CM Jagan) చొరవతోనే పోలవరానికి నిధులు విడుదలయ్యానని పేర్కొన్నారు. పోలవరంపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలని విమర్శించారు. కడుపు మంటతోనే రామోజీ(Ramoji Rao) అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని అన్నారు.
