జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రి అంబ‌టి రాంబాబు మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)పై మంత్రి అంబ‌టి రాంబాబు(Minister Ambati Rambabu) మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. వైయస్సార్‌సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు టీడీపీ(TDP), జనసేన(Janasena) కలయిక ప్రభుత్వం అవసరమని పవన్‌కళ్యాణ్‌ చెబుతాడు. ఆ పార్టీ బతుకంతా కలహాల కాపురమే అని చెప్పాలి. 2014లో కూడా కలిసి పోటీ చేశారని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు టీడీపీ, జనసేన కలయిక ప్రభుత్వం అవసరమని పవన్‌కళ్యాణ్‌ చెబుతాడు. మరి, ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నాడో చంద్రబాబు ధైర్యంగా సమాధానం చెప్పగలరా..? అని ప్ర‌శ్నించారు. పవన్‌కళ్యాణ్‌ ఎన్ని సీట్లు తీసుకోవాలని అనుకుంటున్నాడో ఆయన్ను చెప్పమనండి. మీ ఇద్దరు కలిసేది రాష్ట్ర భవిష్యత్తుకా..? మరి, గతంలో మీ రెండు పార్టీలు ఉమ్మడి పోటీచేసి అధికారంలోకి వచ్చినప్పుడు మీరు కాపాడిన రాష్ట్ర భవిష్యత్తేంటో చెప్పండి? అని నిల‌దీశారు.

అధికారంలోకి రాగానే మీరు తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఒకరినొకరు విమర్శించుకున్నారు. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా..? అని అడిగారు. అప్పట్లో మోదీ(PM Modi) మీతో కలిసి పోటీ చేసినా.. ఆ తర్వాత వారు విడిపోయినా.. ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఒకసారి చంద్రబాబు(Chandrababu), పవన్‌కళ్యాణ్‌ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మరలా ఇప్పుడు కలుస్తామంటున్నారని అన్నారు.

Updated On 16 Dec 2023 10:08 AM GMT
Yagnik

Yagnik

Next Story