Minister Ambati Bhogi Celebrations : భోగి సంబరాల్లో మంత్రి సందడి..స్టెప్పులతో అదరగొట్టిన అంబటి !
పల్నాడుజిల్లా సత్తెనపల్లి సంక్రాంతి(Sankranti) సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. సత్తెనపల్లిలో(Sattenapally) నిర్వహించిన భోగి వేడుకల్లో(Bhogi Celebrations) మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పాల్గొన్నారు. బోగి మంటల వద్ద బంజారా మహిళలతో కలిసి తనదైన శైలిలో స్టెప్పులేసి(Dance) సందడి చేశారు. సంబరాల రాంబాబు అనే పాటకు స్టె్‌ప్పులు వేసి కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహపరించారు

Minister Ambati Bhogi Celebrations
పల్నాడుజిల్లా సత్తెనపల్లి సంక్రాంతి(Sankranti) సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. సత్తెనపల్లిలో(Sattenapally) నిర్వహించిన భోగి వేడుకల్లో(Bhogi Celebrations) మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పాల్గొన్నారు. బోగి మంటల వద్ద బంజారా మహిళలతో కలిసి తనదైన శైలిలో స్టెప్పులేసి(Dance) సందడి చేశారు. సంబరాల రాంబాబు అనే పాటకు స్టె్‌ప్పులు వేసి కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహపరించారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. అయితే గత ఏడాది మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడారు. సంక్రాంతికి ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించినట్టు చెప్పారు. గతంలో డ్యాన్స్ చేస్తే కొందరు తనను సంబరాల రాంబాబు అంటూ విమర్శించారని గుర్తు చేశారు. అందుకే సంబరాలు రాంబాబు పేరుతో పాట రాయించానని తెలిపారు. సంక్రాంతి వస్తే నేను సంబరాలు రాంబాబునేనని అన్నారు. ఇక.. టీడీపీ, జనసేన ఆనైతికంగా పొత్తును కుదుర్చుకున్నాయని.. ప్రజలు ఆ రెండు పార్టీలను భోగిమంటల్లో వేసి తగలపెడతారు’’ అంటూ..ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
