Minister Ambati Rambabu : పదవి కోసం పాకులాడేవాడిని సమాజం క్షమించదు
వంగవీంటి రంగాను(Vangavinti Ranga) చంపింది నాటి టీడీపీ(TDP) ప్రభుత్వమేనని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వంగవీంటి రంగాను చంపడం వల్లే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్(Congress) నుంచి ఒకరిద్దరు నేతలు పార్టీలు మారడం వల్ల మళ్లీ ఎన్టీఆర్(NTR) అధికారంలోకి రావడం జరిగిందని
వంగవీంటి రంగాను(Vangavinti Ranga) చంపింది నాటి టీడీపీ(TDP) ప్రభుత్వమేనని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వంగవీంటి రంగాను చంపడం వల్లే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్(Congress) నుంచి ఒకరిద్దరు నేతలు పార్టీలు మారడం వల్ల మళ్లీ ఎన్టీఆర్(NTR) అధికారంలోకి రావడం జరిగిందని.. ఆ సమయంలో తాను తొలిసారిగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని.. ఆ తర్వాత మళ్లీ 2019లోనే తాను శాసనసభ్యుడిగా గెలిచానని.. ఈ మధ్యలో ఖాళీగానే ఉన్నానని వివరించారు.
తాను గతంలో కాంగ్రెస్ లో ఉన్నా.. వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekar reddy) చనిపోగానే జగన్(Jagan) వెంట నడిచానని తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి.. పోతాయన్నారు. తనపై పోటీ చేయనున్న నేత (Kanna Lakshminarayana) కూడా గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారని వెల్లడించారు. వంగవీటి రంగాను చంపింది టీడీపీనేనని ఆయన కూడా అనేక సందర్భాల్లో అన్నాడని గుర్తుచేశారు. రంగాను చంపింది చంద్రబాబేనని డైరెక్ట్ గా అన్నారని.. రంగాను చంపడమే కాకుండా.. తనను కూడా చంపాలని ప్రయత్నించాడని.. రంగాను చంపగలిగాడు కానీ.. నన్ను చంపలేకపోయాడు అని ఆ నేత చెప్పారని వివరించారు. కానీ ఇవాళ ఏం జరుగుతోంది.? పదవి కోసం పాకులాడేవాడిని సమాజం క్షమించదని కన్నాపై విమర్శలు గుప్పించారు.