Minister Ambati Rambabu : ఇద్దరు పీకే ల వల్ల టీడీపీ బ్రతికే పరిస్థితులు లేవు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

Minister Ambati Rambabu Comments on TDP
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore)తో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇద్దరు పీకేల( ప్రశాంత్ కిషోర్, పవన్ కల్యాణ్(Pawan Kalyan)) వల్ల టీడీపీ(TDP) బ్రతికే పరిస్థితులు లేవని అన్నారు. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనికొస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడని అన్నారు.
తమ రాజకీయాల కోసం తండ్రి చంద్రబాబు, కొడుకు లోకేశ్(Lokesh) ఎంతటి నీచానికైనా దిగజారుతారని అనడానికి ఈ భేటీ ఒక నిదర్శనమని అన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్‌ను బీహార్ డెకాయిట్ అని చంద్రబాబు వ్యాఖ్యనించారని గుర్తు చేశారు. ‘ మేటిరియల్ బాగా లేకపోతే మేస్త్రి ఏం చేస్తాడని’ లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యమని వెల్లడించారు. వ్యూహకర్తలు మారినంత మాత్రాన ఆ పార్టీకి ఎలాంటి మేలు జరుగదని స్పష్టం చేశారు.
