Minister Ambati : ఆయన పిచ్చోడు కావొచ్చు కానీ.. ఆ సామాజికవర్గం మాత్రం కాదు
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందర్నీ.. లాజికల్ ప్రశ్న, జెన్యూన్ ప్రశ్న ఒకటి అడుగుతున్నాను. అవినీతి కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్టు చేస్తే.. ఏ ప్రతిపక్ష నాయకుడుగానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ వెళ్ళలేదు. ఒకే ఒక్క పవన్ కల్యాణ్ వెళ్ళి, తెలుగుదేశానికి(TDP) అండగా ఉంటాను, కలిసి పోటీ చేస్తానను అని పిచ్చి పవన్ కల్యాణ్ ఒక్కడే చెప్పాడు.

Minister Ambati
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందర్నీ.. లాజికల్ ప్రశ్న, జెన్యూన్ ప్రశ్న ఒకటి అడుగుతున్నాను. అవినీతి కేసులో చంద్రబాబును(Chandrababu) అరెస్టు చేస్తే.. ఏ ప్రతిపక్ష నాయకుడుగానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ వెళ్ళలేదు. ఒకే ఒక్క పవన్ కల్యాణ్ వెళ్ళి, తెలుగుదేశానికి(TDP) అండగా ఉంటాను, కలిసి పోటీ చేస్తానను అని పిచ్చి పవన్ కల్యాణ్ ఒక్కడే చెప్పాడు. పవన్ కల్యాణ్ ఇంత త్యాగం చేస్తే.. ఆయన తెలంగాణలో 8 సీట్లల్లో పోటీ చేస్తే.. పవన్ కల్యాణ్ ను గెలిపిస్తామని చంద్రబాబు సామాజికి వర్గం వారు అనలేదు ఎందుకు..? అని ప్రశ్నించారు.
చంద్రబాబు కోసం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ పిచ్చోడు అయితే పిచ్చోడు అవ్వొచ్చేమో గానీ.. ఆయనను మోస్తున్న ఆ సామాజిక వర్గం వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు కాదని అన్నారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం వారిని కూకటిపల్లిలో, వేరే స్థానాల్లో ఓడిస్తారా..? ఇక్కడేమో ఆయన సామాజికవర్గం మిమ్మల్ని మోయాలా..? అని ప్రశ్నించారు. ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు గుర్తు పెట్టుకోండన్నారు. గ్లాసును తుక్కు తుక్కుగా ఓడించడానికి చంద్రబాబు, ఆయన సామాజికవర్గం తెలంగాణలో ప్రయత్నించిందా.. లేదా..? అని అడిగారు. ప్రజలేమీ అమాయకులు కాదు.. మీరు ఆడినట్టు ఆడటానికి.. అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.
