Minister Ambati Rambabu : లోకేష్, పవన్‌లపై మంత్రి అంబటి సెటైర్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. లోకేస్ పాదయాత్ర పొదలాడ నుంచి రేపు ఉదయం 10.19 గంటలకు ప్రారంభించనున్నారు.

Minister Ambati Rambabu Comments on Lokesh And Pawan
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(Yuvagalam) పాదయాత్ర పునఃప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. లోకేస్ పాదయాత్ర పొదలాడ నుంచి రేపు ఉదయం 10.19 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ విషయమై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందిస్తూ.. సెటైర్లు సంధించారు. రేపటి నుంచి హాస్యభరిత కామెడీ గళం ప్రారంభం కానుందన్నారు. ఆగిపోయిన హాస్య భరిత చిత్రం మళ్లీ ప్రారంభం కాబోతోంది. దాన్ని క్యామిడీ గళం అంటారో.. ఏమంటారో మీ ఇష్టం అన్నారు. అసలు యాత్ర ఎందుకు మొదలు పెట్టాడో.. ఎందుకు ఆపేశాడో.. ఎందుకు మొదలు పెడుతున్నాడో తెలియదన్నారు. ఈ అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి అందరూ చూడొచ్చన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి పవన్ కల్యాణ్ ధైర్యం పొందుతుంటాడన్నారు. తెలంగాణ పోరాటం చూసి ధైర్యం పొందానంటాడు.. చెగువీరా పోరాటం చూసి ధైర్యం పొందానంటాడు. భగత్ సింగ్‌ను చూసి అంటాడు.. కమ్యూనిస్టులను చూసి ధైర్యం పొందాను అంటాడు.. అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్దామనుకున్నాను అంటాడు.. అతన్ని ఎవరికైనా చూపిస్తే మంచిదని ఎద్దేవా చేశారు.
