Minister Ambati Rambabu : ఇదే సరైన అవకాశం.. నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి
సభలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీకి కావాల్సింది చర్చ కాదు.. రచ్చ అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్, అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Minister Ambati Rambabu advises MLA Balakrishna
సభలో చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)పై టీడీపీ(TDP)కి కావాల్సింది చర్చ కాదు.. రచ్చ అని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్, అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రోజు సభలో చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. కానీ టీడీపీ వారు మాత్రం సిద్ధంగా లేరు.. మీకు నిజంగా చర్చకు చిత్తశుద్ధి ఉంటే రండి అని సవాల్ విసిరారు. మీకు నమ్మకం ఉంటే.. చంద్రబాబు నీతిమంతుడు, నిప్పు అనే విశ్వాసం ఉంటే చర్చలో పాల్గొనండి.. పారిపోవద్దని అన్నారు.
మీసాలు తిప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. ముందుగా బాలకృష్ణ(Balakrishna) మీసాలు టీడీపీలో తిప్పాలి.
ఇప్పటికైనా, మీ తండ్రిగారైన నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao) వెన్నులో దించిన కత్తి తీసుకుని బయటకు రండని అన్నారు. ఇది మీకు ఒక మంచి అవకాశం. మీ నాన్న పెట్టిన పార్టీని బతికించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. జన్మనిచ్చిన తండ్రికి క్లిష్ట సమయంలో మీరు సహాయం చేయలేదనే అపవాదు ఉంది.
ఆ అపవాదును తుడిచివేసే మహత్తర అవకాశం బాలకృష్ణకు వచ్చింది. ఇప్పుడు మీ బావ జైల్లో ఉన్నారు. మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నాడు.. ఎందుకు ఉన్నాడో తెలియదు. ఈ అవకాశం మళ్లీ రాదు.. నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండని అంబటి వ్యాఖ్యానించారు. పార్టీ పగ్గాలు మళ్లీ తీసుకుని.. మీ పార్టీని బతికించుకోండి. అలా బతికించుకోడానికి ఇదొక చక్కని అవకాశం. మీ నాన్న పెట్టిన పార్టీని బతికించుకునే చక్కని అవకాశం.. మీపై పడిన మచ్చను మాపుకునే అవకాశం. మీరు సమర్ధులే అయితే ఆ పని చేయండని బాలకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీ బావగారు ముఖ్యమంత్రిగా చేశారు. మీ అల్లుడు(Nara Lokesh) అసలు ఎక్కడా గెలవకుండానే మంత్రిగా చేశాడు. మీరు రెండు సార్లు గెలిచినా మంత్రిగా చేయలేకపోయారు. మీ అన్న హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టాడు. ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి.. మీ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. మీకు నాయకత్వ లక్షణాలున్నాయి. అలా అని శాసన సభలో కాదు.. మీసం తిప్పాల్సింది.. మీ పార్టీలో తిప్పండి.. మా వ్యతిరేక పార్టీ అయినా సరే ఒక సూచన, సలహా ఇస్తున్నానని అంబటి వ్యాఖ్యానించారు.
