Minister Ambati Rambabu : కంటి ఆపరేషన్ కు బెయిల్ ఇస్తే.. ధర్మం గెలిచినట్టా?
మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) మాట్లాడుతూ గెలిచింది న్యాయం, ధర్మం, సత్యం కాదు.. మరో కంటికి ఆపరేషన్. చంద్రబాబుకు(Chandrababu) ఉన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, మరో కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్(Cataract operation) చేయించుకోవాలనే విన్నపంతో, మానవతా దృక్పథంతో మాత్రమే.. హైకోర్టు(High Court) చంద్రబాబుకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్(Interim Bail) ఇవ్వటం జరిగింది. దీనికి, టీడీపీ వాళ్ళు న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని, ధర్మం గెలిచిందని నానా హంగామా చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు.ఇది దురదృష్టకరం.
మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) మాట్లాడుతూ గెలిచింది న్యాయం, ధర్మం, సత్యం కాదు.. మరో కంటికి ఆపరేషన్. చంద్రబాబుకు(Chandrababu) ఉన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, మరో కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్(Cataract operation) చేయించుకోవాలనే విన్నపంతో, మానవతా దృక్పథంతో మాత్రమే.. హైకోర్టు(High Court) చంద్రబాబుకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్(Interim Bail) ఇవ్వటం జరిగింది. దీనికి, టీడీపీ వాళ్ళు న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని, ధర్మం గెలిచిందని నానా హంగామా చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు.ఇది దురదృష్టకరం. నిజం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదన్నది టీడీపీ(TDP) శ్రేణులు తెలుసుకోవాలి. స్కిల్ స్కాం కేసులో జ్యుడీషియరీ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు బయటకు వెళితే.. సాక్ష్యులను తారుమారు చేయరు అనే ఉద్దేశంతో కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. అలానే, ఈ కేసు విచారణ పూర్తైంది, చంద్రబాబు బయటకు వెళ్ళినా కేసులో ఎటువంటి మార్పులు చేయలేడు అని కూడా బెయిల్ ఇవ్వలేదు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇచ్చారనేది హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన గతంలో ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు, మరో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన వ్యక్తిగత డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లు కూడా చెప్పడంతో.. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. క్యాటరాక్ట్ ఆపరేషన్(Cataract operation) చేయించుకుని నాలుగు వారాల్లో తిరిగి మీరు రిమాండ్ కు రావాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
ఇది ఒక తాత్కాలిక రిలీఫ్ మాత్రమే. కోర్టు ఇచ్చిన నిబంధనలను పాటిస్తూ, నాలుగు వార్వాల తర్వాత మళ్ళీ చంద్రబాబు జైలులో సరెండర్ కావాలి. ఏ కేసులో అయినా, న్యాయం ఎప్పుడు గెలుస్తుంది.. ఆ కేసులో విచారణ జరిగి కేసు కొట్టివేస్తే అప్పుడు న్యాయం గెలిచిందనుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబుపై కేసు దర్యాప్తులో ఉంది.ఇప్పటికే చంద్రబాబు తనతోటి కొంతమంది ముద్దాయిలను విదేశాలకు పంపించాడు. ఇంకా వారిని విచారించాల్సి ఉంది. చంద్రబాబుకు ఇంతకుముందు కూడా ఏసీబీ కోర్టు ఒక రిలీఫ్ ఇచ్చింది. ఆయన ఆరోగ్య రీత్యా, వేడి వాతావరణం వల్ల ఆయనకు చెమటలు పడుతున్నాయని, దానివల్ల శరీరంపై దురదలు పెరుగుతున్నాయంటే ఏసీలు ఏర్పాటు చేయమని కోర్టు చెప్పింది. ఇవాళ హైకోర్టు ఇచ్చింది కూడా మరో రిలీఫ్. రాజమండ్రి సెంట్రల్ జైలులో కంటి ఆపరేషన్ చేయలేరు కాబట్టి ఆయన కంటి సమస్యల దృష్ట్యా ఇచ్చిన మరో రిలీఫ్ మాత్రమే. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వస్తే.. లోకేష్ యుద్ధం మొదలైంది అంటున్నాడు. ఇప్పుడే మొదలైతే మరి, ఎర్ర డైరీ పట్టుకుని రాసుకుంటున్నాను, యుద్ధం మొదలైంది అని అప్పుడు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికినప్పుడు, ఇన్ని ఆరోపణలు వచ్చినా.. ఏం పీకారని అని సవాళ్ళు విసిరినప్పుడు ఏమైంది..?. టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, అత్యుత్సాహంతో నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదు.చంద్రబాబు పూర్తి రిలీఫ్ తో బయటకు ఏమీ రాలేదు. మానవతాదృక్పథంతో కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం, నిబంధనలతో ఇచ్చిన మధ్యంతర బెయిల్ మాత్రమే.. దీనికి ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం అంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు.
నెక్ట్స్ ఏపీలోనూ జెండా పీకేస్తారు : ఎక్కడైతే, నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) గారు టీడీపీని ప్రారంభించాడో, స్థాపించాడో, ఆ పార్టీ జెండా పాతాడే.. ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ జెండా ఎగురవేశాడో.. అక్కడే టీడీపీ జెండాను చంద్రబాబు పీకేశాడు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయింది. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది. జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టి, ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి, బీసీలకు పట్టం కడతామని చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి, చివరికి ఆ పార్టీ జెండానే పీకేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వరకూ తెలంగాణలో పోటీ చేస్తామని, అభ్యర్థుల జాబితాను తయారు చేయాలని జ్ఞానేశ్వర్ కు చెప్పి, ఈలోపే పార్టీ జెండాను చంద్రబాబు పీకేశారు. తెలంగాణలో పోటీ చేయకుండా పారిపోయారు. ఆంధ్రాలో కూడా ఎన్నికల ముందో,ఆ తర్వాతో టీడీపీ జెండా పీకేస్తారు.బహుశా ఎన్నికల తర్వాత పీకేస్తారు. ఇది ఖాయం. జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఇతర పార్టీల గెలుపు కోసం తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టారని ఆయనే చెప్పాడు. ఇతర పార్టీలంటే ఏ పార్టీలో నేను చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల ఈ పార్టీలో తాను ఉండలేనని రాజీనామా చేసివెళ్ళిపోయాడు. చంద్రబాబు రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయన్నది.. తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. పైగా, జ్ఞానేశ్వర్ ఫోన్లు చేస్తుంటే లోకేష్ ఫోన్లు కూడా ఎత్తడం లేదట. లోకేష్(lokesh) వల్లే సర్వనాశనం అయిందని కూడా జ్ఞానేశ్వర్ చెప్పాడు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా టీడీపీకి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే తెలంగాణాలో ఆ పార్టీ జెండా పీకేయడమే.
"Written By : Senior Journalist M Phani Kumar"