TS Weather Forecast : 23 వరకు తెలుగు రాష్ట్రాలలో అతి భారీ వర్షాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నెల
23వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో(Telugu states) మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ(Weather department) తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

TS Weather Forecast
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నెల
23వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో(Telugu states) మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ(Weather department) తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనం బలపడి మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్ర మట్టాలనికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరరిత ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది.ఇదిలా ఉంటే దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఆదివారంనాటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణశాఖ పేర్కొంది.
