Saidharam Tej : వివాదంలో హీరో సాయిధరమ్ తేజ్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం ప్రముఖ సినీ హీరో సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్ తేజ్ హారతిచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mega Hero Saidharam Tej in Controversy
తిరుపతి(Tirupati) జిల్లా శ్రీకాళహస్తీశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి(Srikalahasteeshwara Subrahmanyeshwara Swami) ఆలయాన్ని శుక్రవారం ప్రముఖ సినీ హీరో సాయిధరమ్ తేజ్(Saidharam Tej) దర్శించుకున్నారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సాయి ధరమ్ తేజ్ హారతిచ్చారు. దీంతో భక్తులు(Devotees) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. అనంతరం స్వయంగా స్వామివారికి హారతి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో(Video) వైరల్ అవ్వడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమనిబంధనల ప్రకారం.. అర్చకులు మాత్రమే స్వామివారికి హారతులివ్వాలని.. సినీ హీరో ఎలా ఇస్తాడంటూ.. సాయిధరమ్ తేజ్, ఆలయ అదికారులపై భక్తులు ఫైర్ అవుతున్నారు. హారతి ఇచ్చేందుకు సాయి ధరమ్ తేజ్ కు ఎలా అనుమతిచ్చారంటూ భక్తులు అధికారులకు ప్రశ్నలు సంధిస్తున్నారు.
