Kakinada shampoo Crime : షాంపూతో జుట్టురాలిపోయింటూ మహిళ దుర్భాషలు.. కత్తితో దాడి చేసిన యువకుడు
కాకినాడలో(Kakinada) దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిపై(Old Woman) యువకుడు కత్తితో(Knife)దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ యువకుడిపై హత్యాయత్న కేసు(Murder Attempt Case) నమోదు చేసిన కాకినాడ రెండో పట్టణ పోలీసులు వివరాలు తెలిపారు. వారు చెప్పినదాని ప్రకారం గాంధీనగర్(Gandhi nagar) వెంకటనారాయణ(venkat Narayana) వీధికి చెందిన చెల్లంచెర్ల సత్యవతి ఇటీవల ఓ మెడికల్ షాపులో షాంపూ(Shampoo) కొన్నారు.

Kakinada shampoo Crime
కాకినాడలో(Kakinada) దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిపై(Old Woman) యువకుడు కత్తితో(Knife)దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ యువకుడిపై హత్యాయత్న కేసు(Murder Attempt Case) నమోదు చేసిన కాకినాడ రెండో పట్టణ పోలీసులు వివరాలు తెలిపారు. వారు చెప్పినదాని ప్రకారం గాంధీనగర్(Gandhi nagar) వెంకటనారాయణ(venkat Narayana) వీధికి చెందిన చెల్లంచెర్ల సత్యవతి ఇటీవల ఓ మెడికల్ షాపులో షాంపూ(Shampoo) కొన్నారు. ఆ షాంపూ వాడిన తర్వాత జుట్టంతా రాలిపోయిందంటూ ఆ షాపులో పని చేస్తున్న పెన్నాడ వెంకటేశ్ అనే యువకుడిని పట్టుకుని దూషించడం మొదలుపెట్టింది. ఆమె రోజూ ఇదే పనిగా పెట్టుకుది. ప్రతి రోజూ ఇలా తిట్టిపోస్తుండటంతో యువకుడికి చిరాకుతో పాటు కోపమూ వచ్చేసింది. ఆదివారం పక్కనే ఉన్న ప్లాస్టిక్ షాపులో 30 రూపాయలిచ్చి ఓ చాకు కొన్నాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి ఆమె శరీరంపై పలు చోట్ల పొడిచాడు. చాకు విరిగిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమెను గమనించిన చుట్టుపక్కలవారు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పెనుగులాటలో ఆమె బంగారు గొలుసు తెగి కిందపడింది. మొదట గొలుసు కోసం దాడి జరిగిందని పోలీసులు అనుకున్నారు. తర్వాత అసలు విషయం తెలిసింది.
