Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఒక బోటులో సంభవించిన ప్రమాదంతో ఇతర బోట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
విశాఖ(Visakhapatnam)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్(Visakhapatnam Fishing Harbour) లో ఒక బోటు(Boat)లో సంభవించిన ప్రమాదంతో ఇతర బోట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. దాదాపు నలభై బోట్లకు పైగానే మంటలకు ఆహుతయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బోట్లలో లక్షల విలువ చేసే మత్స్య సంపద ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.. కళ్లముందే తమ జీవనాధారమైన బోట్లన్నీ మంటల్లో కాలిపోతుండడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.
సీఎం దిగ్భ్రాంతి
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు