mangalagiri: మంగళగిరిపై రెండు పార్టీల గురి..రాజధాని సెంటిమెంట్ లోకేష్‌ను గెలిపిస్తుందా?
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన సీటు మంగళగిరి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(alla ramakrishna reddy)కి రాజీనామాతో అందరి దృష్టి మంగళగిరిపై పడింది. తాజాగా మంగళగిరి(mangalagiri) ఇంఛార్జీ బాధ్యతలను బీసీ సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవి(Ganji Chiranjeevi)కి అప్పగించింది వైసీపీ. సామాజికవర్గ లెక్కలతో బలమైన అభ్యర్థి గంజి చిరంజీవిని వైసీపీ బరిలోకి దించుతుండగా..గతంలో రాజధాని సెంటిమెంట్‌ను నమ్ముకొని భంగపడిన యువనేత లోకేష్.. మరోసారి సమరానికి సై అంటున్నారు. మరి..రాజధాని తరలింపు నిర్ణయంతో ప్రాతికూల పవనాలను ఎదుర్కొంటున్న వైసీపీకి..అభ్యర్థి మార్పు కలిసొస్తుందా? ఆనేదానిపై మంగళగిరి(mangalagiri) నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో గెలుపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ(tdp)కి ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ అభ్యర్థుల ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టింది. రాజధాని తరలింపుతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వైసీపీ..మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(alla ramakrishna reddy)కి ఈసారి టికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడం.. ఆ వెంటనే మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవికి మంగళగిరి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించడం జరిగిపోయాయి. రాజధాని తరలింపు నిర్ణయంతో ఎదురైన ప్రతికూలతని..బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పెట్టి.. మంగళగిరిలో మళ్లీ విజయం సాధించాలని వైసీపీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు(Murugudu Hanmantha Rao), కాండ్రు కమల టికెట్ ఆశించినా..టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికే అవకాశం కల్పించింది. మంగళగిరిలో చేనేత వర్గాల ఓట్లు ఎక్కువ. అందుకే లోకేష్ టార్గెట్‌గా..వ్యూహాత్మకంగానే ఆ సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవి(Ganji Chiranjeevi)ని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకుని చేనేత కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించింది.
గత ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్లతో ఓడిపోయిన యువనేత లోకేష్..ఈసారి మంగళగిరిలో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ సవాల్ చేస్తున్నారు. పరాభవం ఎదురైనా చోటే గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న నారా లోకేష్(Nara Lokesh)..విస్తృత సేవా కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి ప్రతికూలంగా మారిన రాజధాని తరలింపు అంశాన్ని ఎన్నికల ఆస్త్రంగా మార్చుకుని..విజయం సాధించాలని చూస్తున్నారు. ఇది స్థానికంగా అన్ని వర్గాలను ప్రభావితం చేసే అంశం కావడంతో లోకేష్‌కు కలిసొస్తుందనేది పరిశీలకుల అభిప్రాయం. మరోవైపు చేనేత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(Panchumarthi Anuradha)కు మంగళగిరి బాధ్యతలు అప్పగించింది. ఆమె ప్రొటోకాల్ నియోజవకర్గంగా మంగళగిరిని ఎంచుకుని.. లోకేష్ విజయమే లక్ష్యంగా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాజధాని సెంటిమెంట్‌తో ఈజీగా గెలుస్తారని భావించినా.. వైసీపీ హవాలో కంగుతిన్నారు లోకేష్. ఈ సారి అదే రాజధాని సెంటిమెంట్ బలంగా ఉండటంతో లోకేష్‌కు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. పైగా 2014లో కేవలం 12 ఓట్ల తేడాతోనే ఈ సీటును కోల్పోయింది టీడీపీ. ఈ లెక్కలన్నీ బేరీజు వేస్తోన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం పెంచుకుంటోంది.