అనుకున్నట్టుగానే మంచు మనోజ్ ఆళ్లగడ్డ వెళ్ళారు. 1000 కార్లతో కాదు కానీ అతడి వెంట ఓ పది కార్లు వెళ్ళాయి.

అనుకున్నట్టుగానే మంచు మనోజ్ ఆళ్లగడ్డ వెళ్ళారు. 1000 కార్లతో కాదు కానీ అతడి వెంట ఓ పది కార్లు వెళ్ళాయి. మౌనిక సొంత ఊరు కాబట్టి అక్కడికి వెయ్యి కార్లతో వెళ్లి, ప్రసంగాలు చేసి జనసేన పార్టీ(Janasena) లో చేరతారని అందరూ అనుకున్నారు. మనోజ్(Manoj) మాత్రం కూతురును మొదటిసారి అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చానని చెప్పారంతే! జనసేన లో ఎప్పుడు చేరుతున్నారు అన్న ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పకుండా నో కామెంట్ అని చెప్పాడు. ఇప్పుడు చేరిక వాయిదా పడింది అంతే. మనోజ్ జనసేనలో చేరడం మాత్రం పక్కా! ఎందుకంటే మనోజ్ కు రాజకీయాల మీద మోజు ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు రాజకీయాలలోకి వస్తానంటూ అప్పుడెప్పుడో మనోజ్ చెప్పాడు. త్వరలోనే ఆ సరైన సమయం రావొచ్చు. జనసేన పార్టీ కి కూడా మనోజ్ వంటి ప్రజలకు తెలిసిన వాళ్ళు కావాలి. మనోజ్ రాక ను పవన్ అభ్యతరం చెప్పకపోవొచ్చు. చూడాలి ఏం జరుగుతుందో!

ehatv

ehatv

Next Story