ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. ప్రేమించలేదనే కారణంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్‌ విద్యార్థినిపై ఓ ఉన్మాది పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ అమ్మాయి అరవకుండా ఉండేందుకు నోట్లో బట్టలు కుక్కాడు. పాపం ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత వాడు కూడా నిప్పంటించుకున్నాడు. అయితే ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేసి వాడిని చితక్కొట్టారు. వారి నుంచి తప్పించుకున్న ఆ దుర్మార్గుడు చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన బాలికను లహరి(Lahari)గా గుర్తించారు. ఆమె స్వస్థలం వెల్దుర్తి మండలం రామళ్లకోట. తండ్రి చనిపోవడంతో నందికొట్కూరులోని బైరెడ్డినగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నది. నిందితుడి కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర(Ragavendra) గత కొంత కాలంగా లహరిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

ehatv

ehatv

Next Story