Ongole Crime : తల్లితో సహజీవనం చేస్తూ కూతురుని లోబరుచుకున్నాడు!
ఓ మహిళతో సహ జీవనం(Living together) చేస్తున్న ఓ వ్యక్తి ఆమె కూతురుకి(Daughter) మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
ఓ మహిళతో సహ జీవనం(Living together) చేస్తున్న ఓ వ్యక్తి ఆమె కూతురుకి(Daughter) మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తర్వాత కూతురును అపహరించి తనతో తీసుకెళ్లాడు. ఈ ఘటన ఒంగోలులో(Ongole) జరిగింది. ఒంగోలు దగ్గరలో ఉన్న ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్తతో విడిపోయింది. పదో తరగతి చదువుతున్న కూతురుతో వేరుగా ఉంటోంది. ఆమె టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తితో కొంతకాలంగా సహ జీవనం చేస్తోంది. ఆమె కూతురును రోజూ స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకొస్తుండేవాడు. తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ దుర్మార్గుడు అనైతికంగా వ్యవహరించాడు. ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. రెండు రోజుల కిందట స్కూల్‌కు అని చెప్పి ఇద్దరు ఇంటి నుంచి వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. బాలిక తల్లికి అనుమానం వచ్చి ఒంగోలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు బాలికతో పాటు ఇండ్లా రాజు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారిద్దరిని ఒంగోలు తీసుకొచ్చారు. ఇండ్లా రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.