Kakinada : సెల్‌టవర్ ఎక్కిన యువకుడు, చాకచక్యంతో దించిన పోలీసులు
అయిందానికి కానిదానికి సెల్ టవర్(Cell Tower) ఎక్కేసి భయపెట్టడం కామనయ్యింది. కాకినాడలో(Kakinada) ఇట్టాగే ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం(suicide) చేశాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి చాకచక్యంతో వ్యవహరించి అతడిని కిందకు దించారు. అసలేం జరిగిందంటే.. కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్‌కుమార్‌ను సెల్‌ఫోన్ దొంగగా(Thief) స్థానికులు అనుమానించారు.

Kakinada
అయిందానికి కానిదానికి సెల్ టవర్(Cell Tower) ఎక్కేసి భయపెట్టడం కామనయ్యింది. కాకినాడలో(Kakinada) ఇట్టాగే ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం(suicide) చేశాడు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి చాకచక్యంతో వ్యవహరించి అతడిని కిందకు దించారు. అసలేం జరిగిందంటే.. కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్‌కుమార్‌ను సెల్‌ఫోన్ దొంగగా(Thief) స్థానికులు అనుమానించారు. అవమానించారు. ఆ అవమానం భరించలేక ప్రదీప్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) టవరుపై ఎక్కి చనిపోతానంటూ బెదిరించసాగాడు. స్థానికులు పోలీసులకు కబురు పెట్టడంతో సీఐ కృష్ణ భగవాన్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సాగర్‌బాబు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ఘటనాస్థలికి చేరుకుని ప్రదీప్‌కు ధైర్యం చెప్పింది. అతడిపై పడిన నిందను తొలగిస్తామని హామీ ఇచ్చింది. అతడిని కిందకు దించింది. అనంతరం యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
